Woman stripped for Ice cream: అర్జెంటీనాలో ఓ మహిళ మాస్కు లేకుండా ఐస్క్రీమ్ స్టోర్కు వచ్చి హల్చల్ సృష్టించింది. మాస్కు లేనిదే ఐస్క్రీమ్ విక్రయించేది లేదని సిబ్బంది చెప్పేసరికి.. తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించింది. ఇదంతా ఐస్క్రీమ్ పార్లర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
పార్లర్లోకి రాగానే.. మాస్కు పెట్టుకోవాలని యువతికి సిబ్బంది సూచించారు. అయితే, ఆమె మాత్రం వారికి గడుసుగా సమాధానం ఇచ్చింది. 'నా మాస్కు గురించి మీరు అడగొద్దు. నేను పెట్టుకుంటున్నా' అంటూ బదులిచ్చింది. తన శరీరంపై ధరించిన దుస్తులను తీసేసి ముఖానికి మాస్కులా పెట్టుకుంది.
-
Woman strips down to her underwear to use her dress as a facemask at ice cream store in Argentina (and stunned father struggles to look elsewhere!)
— truthjacobs3 (@truthjacobs3) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Parliament State security pic.twitter.com/ACmCgTOsmp
">Woman strips down to her underwear to use her dress as a facemask at ice cream store in Argentina (and stunned father struggles to look elsewhere!)
— truthjacobs3 (@truthjacobs3) January 4, 2022
Parliament State security pic.twitter.com/ACmCgTOsmpWoman strips down to her underwear to use her dress as a facemask at ice cream store in Argentina (and stunned father struggles to look elsewhere!)
— truthjacobs3 (@truthjacobs3) January 4, 2022
Parliament State security pic.twitter.com/ACmCgTOsmp
యువతి చేసిన పనికి ఐస్క్రీమ్ పార్లర్ సిబ్బంది నివ్వెరపోయారు. ఇలా ప్రవర్తించినందుకు ఐస్క్రీమ్ విక్రయించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోతూ స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది.
ఆ యువతి పది మంది స్నేహితులతో కలిసి వచ్చిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. అందులో మాస్కు ధరించిన ఓ వ్యక్తి వచ్చి.. ఐస్క్రీమ్లు కొనుక్కొని వెళ్లారని తెలిపింది.
ఇదీ చదవండి: చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు