ETV Bharat / international

ఆస్ట్రాజెనెకా టీకాపై ఎందుకీ అనుమానాలు? - కరోనావైరస్

టీకా వచ్చింది కరోనా భయం పోయిందని సంబరపడ్డ కొద్దిరోజులకే మరో సమస్య ఎదురైంది. కరోనా టీకాల వల్ల కొన్ని ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని తెలిసి కొన్ని దేశాలు టీకా పంపిణీని నిలిపివేశాయి. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం.. రక్త కణాలు తగ్గిపోయి.. తీవ్ర రక్త స్రావం సంభవించడం జరిగాయని డెన్మార్​, నార్వే ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు రక్తం గడ్డకట్టి ఓ వ్యక్తి చనిపోయాడని డెన్మార్క్​ ఆరోపించింది. దాంతో తమ దేశంలో అస్ట్రాజెనెకా టీకాను నిషేధించింది. నార్వే, నెదర్లాండ్​, థాయిలాండ్​ తదితర దేశాలు కూడా ఆస్ట్రాజెనెకా టీకాను తమ దేశంలో నిలిపివేశాయి. మరి ఆస్ట్రాజెనెకా టీకా వల్లే రక్తం గడ్డకట్టడం లాంటి ఆరోగ్యసమస్యలు తెలెత్తుతున్నాయా? ఈ నేపథ్యంలో ఇతర టీకాల మాటేంటి?

Why countries are halting the AstraZeneca shot
ఆస్ట్రాజెనెకా టీకాను దేశాలు ఎందుకు నిలిపివేస్తున్నాయి?
author img

By

Published : Mar 16, 2021, 3:19 PM IST

Updated : Mar 16, 2021, 4:35 PM IST

కరోనా వైరస్​ను అంతమొందించే టీకా వచ్చిందని సంతోషపడ్డాం. చాలా దేశాలలో టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మనకేం కాదు.. కరోనా బారి నుంచి మనం బయటపడ్డట్టే! అని అనుకునే లోపే.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వాక్సిన్​ల పనితీరుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిందని, ఆ కారణంగా ఒక వ్యక్తి మరణించాడని డెన్మార్క్​ ఆరోపిస్తోంది. అస్ట్రాజెనెకా టీకా పంపిణీ తమ దేశంలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు ఇదే కారణంతో ఐర్లాండ్​,నెదర్లాండ్​, థాయిలాండ్​, నార్వే, ఐస్​లాండ్​, బల్గేరియా, కాంగో దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేశాయి.

అయితే ఆ టీకా వల్లే రక్తం గడ్డకట్టి లేదా రక్తకణాలు తగ్గి వ్యక్తులు చనిపోతున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజెన్సీ చెబుతున్నాయి. అంతేకాకుండా వాక్సిన్​ వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. మరి ఎవరి వాదన నిజం? ఆస్ట్రాజెనెకా వల్ల నష్టాలెవైనా ఉన్నాయా? లేవా? టీకా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరెవరు టీకా తీసుకోకూడదూ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

ఏం జరిగింది?

ఆస్ట్రాజెనెకా టీకా పంపణీని నిలిపివేసిన మొట్టమొదటి దేశం డెన్మార్క్​. ఈ టీకా తీసుకున్న కొందరిలో వారం తర్వాత రక్తం గడ్డకట్టడం సమస్య తలెత్తింది. టీకా తీసుకున్న పదిరోజుల తర్వాత రక్తం గడ్డకట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. దాంతో ఆస్ట్రాజెనెకాపై నిషేధం విధించామని ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొంది. రక్తం గడ్డకట్టడానికి ఆస్ట్రాజెనెకా టీకానే కారణమని ఇప్పుడే నిర్ధరణకు రాలేమని వెల్లడించింది.

రక్తకణలల తగ్గుదల!

ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న(50ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు)కొందరిలో రక్తకణాల సంఖ్య తగ్గినట్లు నార్వే ప్రభుత్వం తెలిపింది. దాంతో వారికి తీవ్ర రక్తస్రావం అయినట్లు పేర్కొంది. వెంటనే టీకా పంపిణీని నిలిపివేసింది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నెదర్లాండ్​తో పాటు థాయిలాండ్​, ఐస్​లాండ్​ తదితర దేశాలూ అస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి.

"ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా టీకా వల్ల వచ్చిన దుష్ఫలితాలను చూసి మా దేశంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ టీకా పంపిణీని నిలిపివేశాం"

-హ్యూగో డీ జోంగ్​, నెదర్లాండ్​ ఆరోగ్యమంత్రి.

ఈ వ్యవహారంపై ఆస్ట్రాజెనెకా సంస్థ స్పందించింది.

"యూరోప్​ అంతటా అస్ట్రాజెనెకా టీకా తీసుకున్న దాదాపు 17మిలియన్ల మంది డేటాను పరిశీలిస్తున్నాం. అయితే అస్ట్రాజెనెకా టీకా వల్లే రక్తం గడ్డకట్టం, రక్త కణాలు తగ్గడం వంటి సమస్యలు తెలిత్తినట్లు ఎలాంటి ఆధారాలు లేవు."

-ఆస్ట్రాజెనెకా సంస్థ

ఇదీ చదవండి: 'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్​'

ది యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజెన్సీ కూడా ఇదే సమాధానం చెప్పింది. వాక్సిన్​ తీసుకోని వారిలో రక్తం గడ్డకట్టడాన్ని పోల్చితే టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం దాదాపు సమానంగా ఉందని తెలిపింది.

బ్రిటన్​లో అస్ట్రాజెనెకా టీకాను 11మిలియన్ల మంది తీసుకున్నారు. అందులో 11మందిలో మాత్రమే రక్తం గడ్డకట్టడం వంటి సమస్య ఎదురైంది. అయితే ఆ టీకా వల్లే ఇలా జరిగిందనడానికి ఆధారాలు లేవు.

ఆస్ట్రాజెనెకా టీకా ఆయా దేశాలు ఎందుకు నిలిపివేసినట్టు?

టీకా తీసుకున్నవారిలో కొందరిలో ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని వాక్సిన్​కు అనుమతి ఇచ్చే నాటికే శాస్త్రవేత్తలు ఊహించారు. అయితే లక్షల మంది టీకాను తీసుకున్నప్పుడు అందులో కొందరికి ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం అంటున్నారు.

దాదాపు ఆస్ట్రాజెనకాతో పాటు ఇతర టీకాలు సంవత్సరంలోనే తయారయ్యాయి. టీకా పంపిణీ జరుగుతున్నా కూడా అవి ఇంకా ప్రయోగ దశలో ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి. టీకా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

ఇదీ చదవండి:'ఆస్ట్రాజెనెకా సేఫ్.. అక్కడ తయారైతేనే ఇబ్బంది!'

ఇతర టీకాల పరిస్థితేంటి?

రక్తం గడ్డకట్టడం, రక్తకణాలు తగ్గిపోడం లాంటి సమస్యలు ఫైజర్​, మొడెర్నా, తదితర టీకాల వల్ల సంభవించే అవకాశం ఉందా? లేదా? అన్నదానిపై ది యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజన్సీ పరిశోధన చేస్తోంది.

ఆస్ట్రాజెనెకా వల్ల వేరే సమస్యలు!

50కిపైగా దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీకి అనుమతి లభించింది. బ్రిటన్, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాలో చేసిన పరిశోధనల్లో అస్ట్రాజెనెకా టీకా సురక్షితమని తేలింది.

అయితే ఆస్ట్రాజెనెకా సామర్థ్యాన్ని యూరోప్​ దేశాల నేతలు, ముఖ్యంగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్​ మేక్రాన్​ ప్రశ్నించారు.

ఆస్ట్రాజెనెకాకు అనుమతించిన మొదటి దేశం బ్రిటన్​. పాక్షిక ఫలితాల ఆధారంగా.. 70శాతం సామర్థ్యంతో టీకా పనిచేస్తుందని వెల్లడించింది. ఆ ఫలితాల్లో తయారీ పరంగా లోపాలు ఉన్నట్టు తేలింది. కొందరికి.. తొలి డోసులో సగం టీకానే ఇచ్చినట్టు స్పష్టమైంది. ఈ విషయాన్ని తొలుత ఆస్ట్రాజెనెకా ఒప్పుకోలేదు కూడా!

అయితే ఆస్ట్రాజెనెకాకు అనుమతించేటప్పుడే ఆ టీకా సామర్థ్యం 60 శాతామేనని ది యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజన్సీ తేల్చింది. మరోవైపు వృద్ధులను కరోనా బారి నుంచి ఆస్ట్రాజెనెకా రక్షిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఆ టీకా పంపిణీ చేసిన తొలినాళ్లలో కొన్ని యూరోప్​ దేశాలు.. వృద్ధులకు వాక్సిన్​ ఇవ్వడానికి అనుమతినివ్వలేదు.

ఇదీ చదవండి: వృద్ధులపై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా పనితీరు భేష్​!

ఆస్ట్రాజెనెకా వల్ల బ్రిటన్​లోని చాలామందిలో ఆరోగ్య సమస్యలు ఎదురవడం వల్ల అమెరికాలోని 30,000వేల మందిపై ఆరువారాలపాటు చేస్తున్న టీకా పరిశోధనలను యూఎస్​ ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ నిషేధించింది.

అయితే ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమని, కరోనా నుంచి ప్రజల్ని రక్షిస్తుందని తూర్పు ఆంగ్లియాలో వైద్య కళాశాల ప్రొఫెసర్​ డాక్టర్​. పాల్​ హంటర్​ అంటున్నారు.

ప్రజలకు నిపుణులు ఇచ్చే సందేశం ఏమిటి?

ప్రజలు కచ్చితంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని... అప్పడు ఒకవేళ టీకాల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలిగినా కూడా వాటిని అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఆస్ట్రాజెనికా టీకాతో యూకే స్ట్రెయిన్​కు చెక్!

Last Updated : Mar 16, 2021, 4:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.