ETV Bharat / international

'చైనా మరింత సమాచారం ఇస్తేనే కొవిడ్​పై పోరాటంలో ముందడుగు'

ప్రపంచదేశాలను ఒమిక్రాన్ కలవరపరుస్తున్న వేళ కరోనా పుట్టుకకు సంబంధించి చైనా మరింత సమాచారాన్ని అందించేందుకు ముందుకు వస్తేనే కొవిడ్​పై పోరాటంలో ముందడుగు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్​ఓ సూచించింది. డెల్టా వేరియంట్‌తో పోల్చితే.. ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్​ఓ.. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రజలు పండుగ వేళల్లో గుమికూడకుండా ఉండాలని సూచించింది. వచ్చే ఏడాదితో మహమ్మారికి ముగింపు పలుకుతామనే ధీమా వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్​ఓ.. వైరస్‌ వ్యాప్తిని కనీసస్థాయికి తగ్గించినప్పుడే అది సాధ్యపడుతుందని స్పష్టం చేసింది.

WHO
డబ్ల్యూహెచ్ఓ
author img

By

Published : Dec 21, 2021, 3:14 PM IST

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ఆంక్షల చట్రంలోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో.. కొవిడ్‌పై పోరుకు చైనా సహకారం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. కొవిడ్‌ పుట్టుకకు సంబంధించి చైనా మరింత సమాచారం అందించేందుకు ముందుకు వస్తేనే కొవిడ్‌ పై పోరాటంలో ముందడుగు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న టెడ్రోస్ర్​.. రీ ఇన్‌ఫెక్షన్ ముప్పు సైతం అధికంగా ఉన్నట్లు తెలిపారు. సెలవులు, పండుగలు కారణంగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆయన కేసులు పెరిగితే ఆరోగ్య వ్యవస్థలపై భారం పడటమే కాకుండా మరణాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. పండుగల వేళల్లో ప్రజలు గుమికూడకుండా ఉండాలని సూచించారు.

వ్యవస్థలపై దారుణం..

డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్‌ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇతర వేరియంట్‌లతో పోల్చితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఇప్పుడే అంచనా వేయడం అవివేకమే అవుతుందని అభిప్రాయపడ్డారు. రోగనిరోధక వ్యవస్థలను ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకుంటోందన్న సౌమ్య స్వామినాథన్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోగ్య వ్యవస్థలపై భారం పడుతుందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి స్పష్టమైన సమాచారం ఇంకా లేనందున ఇది ఒక సవాల్‌గా మారిందని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.

తగ్గించగలిగితేనే..

2022 ఏడాదితో కొవిడ్ మహమ్మారికి ముగింపు పలుకుతామనే విశ్వాసాన్ని డబ్ల్యూహెచ్​ఓ బృందం వ్యక్తం చేసింది. రెండు, మూడో జనరేషన్ టీకాలు, యాంటీమైక్రోబియల్ చికిత్సల అభివృద్ధి కారణంగా మహమ్మారికి ముగింపు పలుకుతామని ఆశాభావం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో మహమ్మారి మధ్యస్థాయి లక్షణాలున్న వ్యాధిగా మారి సులువుగా చికిత్స చేసేలా మారుతుందని పేర్కొంది. అయితే వైరస్ వ్యాప్తిని కనీస స్థాయికి తగ్గించగలిగినప్పుడే మహమ్మారిని అంతమొందించవచ్చని తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.