ETV Bharat / international

కరోనా నియంత్రణ కష్టమే: డబ్ల్యూహెచ్​ఓ - కరోనా వైరస్ మార్పులు

కరోనా వైరస్ కాలనుగుణ మార్పులు చెందటం లేదని, ఫలితంగా ఈ మహమ్మారిని నియంత్రించటం కష్ట సాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించింది. వైరస్​కు సంబంధించి ముందస్తు అంచనాలు తప్పాయని తెలిపింది.

WHO
కరోనా వైరస్
author img

By

Published : Aug 10, 2020, 6:52 PM IST

కొన్ని వైరస్‌ల తరహాలో కాలానుగుణ మార్పులను కరోనా వైరస్ ప్రదర్శించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఫలితంగా ఈ మహమ్మారిని నియంత్రించటం కష్టమని డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం సారథి మైఖేల్ రియాన్ అన్నారు.

"ప్రధానంగా శీతాకాలంలో వ్యాపించే ఇన్​ఫ్లూయెంజా వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వైరస్​లా కాకుండా కరోనా మహమ్మారి వేసవిలో వేగంగా సంక్రమించింది. అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా బతకదని కొంతమంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు చేసిన ముందస్తు అంచనాలు తప్పాయి" అని తెలిపారు మైఖేల్.

"వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉన్న దేశాలు సహా అందరికీ సలహాలిస్తున్నాం. నెమ్మదిగా సంక్రమణను తగ్గించే చర్యలను కొనసాగించాలని సూచిస్తున్నాం. వ్యాప్తి అధికంగా ఉన్న బ్రెజిల్ వంటి దేశాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం, మాస్కులు ధరించటం, స్వీయ నిర్బంధం వంటి నిబంధనలను కఠినం చేయాలి."

- మైఖేల్ రియాన్, డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.