ETV Bharat / international

కరోనా రోగులకు 14 రోజుల క్వారంటైనే మేలు! - కొవిడ్ రూల్స్​

WHO Quarantine: కరోనా రోగులకు క్వారంటైన్ గడువును 14 రోజులు ఉంచితేనే ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. అయితే పరిస్థితిని బట్టి ఆయా దేశాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. ఒమిక్రాన్​ లాంటి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్​ను ప్రపంచం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది.

WHO still recommends 14-day quarantine
కరోనా రోగులకు 14 రోజుల క్వారంటైనే మేలు!
author img

By

Published : Jan 5, 2022, 9:56 AM IST

WHO Quarantine: కరోనా బారినపడిన వారు ఐదు నుంచి ఏడు రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్ సమయాన్ని 14 రోజుల పాటు కొనసాగించటమే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే పరిస్థితులను బట్టి ఈ గడువు ఎన్నిరోజులు ఉండాలనే నిర్ణయం ఆయా దేశాలే తీసుకోవాలని సూచించింది. ఈమేరకు డబ్ల్యూహెచ్​ఓ కొవిడ్​ నిర్వహణ మద్దతు బృందంలోని సభ్యుడు అబ్ది మహముద్ మీడియాకు తెలిపారు. ప్రజలు ఇన్​ఫ్ల్యూయెంజాతో పాటు కరోనా బారినపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

"ఇన్​ఫ్ల్యూయెంజా, కరోనా.. రెండూ సోకే ప్రమాదం ఉంది. కానీ ఈ రెండు వైరస్​లు చాలా భిన్నమైనవి. మానవ శరీరంగా వేర్వేరు విధాలుగా దాడి చేస్తాయి. అయితే ఈ రెండు వైరస్​లు కలిసి కొత్త వేరియంట్​గా ఉద్భవించే అవకాశలనూ కొట్టిపారేయలేం. డిసెంబర్​ 29నాటికి 128 దేశాలకు ఒమిక్రాన్​ వ్యాపించింది. దక్షిణాఫ్రికాలో ఈ కేసులు ఒక్కసారిగా గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత అంతే వేగంతో భారీగా తగ్గాయి. కానీ మిగతా దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒమిక్రాన్ ఊపిరితిత్తులపై కాకుండా శ్వసకోశ వ్యవస్థపైభాగంలో దాడి చేస్తోందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. వైరస్​ ముప్పు అధికంగా ఉన్నవారు, వ్యాక్సిన్​ తీసుకోనివారిపై మాత్రం ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్.. ఇతర వేరియంట్లను వారాల్లోనే అధిగమించగలదు. వ్యాక్సిన్ తీసుకోని వారు, జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది విభృంభిస్తుంది. డెన్మార్క్​లో ఆల్ఫా వేరియంట్ కేసులు రెట్టింపు కావడానికి రెండు వారాలు పడితే.. ఒమిక్రాన్​ కేసులు మాత్రం రెండు రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. దీన్ని బట్టి ఈ వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం ఈ స్థాయిలో వ్యాప్తి చెందే వైరస్​ను గతంలో ఎన్నడూ చూడలేదు."

-అబ్ది మహముద్

డబ్ల్యూహెచ్​ఓ వ్యూహాత్మక నిపుణుల సలహా సంఘం(SAGE) జనవరి 19న సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించనుంది. ప్రజలకు కరోనా టీకా బూస్టర్ డోసులు ఎప్పుడు ఇవ్వాలి, వ్యాక్సిన్ల మిక్సింగ్, భవిష్యత్​ టీకాలు వంటి అంశాలు ఈ భేటీ ఎజెండాలో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఫ్రాన్స్​లో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.