ఐరోపాలో కొవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 10 లక్షలు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నతాధికారి డా. హాన్స్ క్లూజ్ తెలిపారు. పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగా ఉందని హెచ్చరించారు. ఐరోపాలో వారానికి 16 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని వెల్లడించారు.
వ్యాక్సిన్లపై నెలకొన్న ఆందోళనలపై స్పందిస్తూ.. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారి కన్నా కరోనాతో బాధపడే వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉందని హాన్స్ చెప్పారు. టీకా తీసుకున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 30 శాతం మరణాలు తగ్గాయని తెలిపారు.
అనుమానాలు వద్దు..
టీకాలపై ఎలాంటి అనుమానాలు వద్దని హాన్స్ స్పష్టం చేశారు. ఆస్ట్రాజెనెకా సమర్థవంతంగా పనిచేస్తోందని, అర్హులందరూ దానిని తప్పక తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ వేగవంతమైన దేశాల్లో కొవిడ్ తగ్గుముఖం