భారత్‌లో గుర్తించిన కరోనా కొత్త రకం వేరియంట్ బి-1617పై.. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ వేరియంట్‌ను విశ్లేషించిన పిదప ఇది 'ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్ రూపాంతరం'గా డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 టెక్నికల్ లీడ్‌కు చెందిన డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.
"బి-1617 వేరియంట్‌పై అంటువ్యాధుల నిపుణుల బృందం, డబ్ల్యూహెచ్ఓ ల్యాబ్ బృందం చర్చింది. ప్రాథమిక స్థాయి అధ్యయనం మేరకు ప్రమాదకర వైరస్‌గా దీనిని గుర్తించాం."
-డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్, డబ్ల్యుూహెచ్ఓ
అయితే ఈ కొత్త మ్యూటెంట్ సమగ్ర అధ్యయనానికి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది. బి-1617 వేరియంట్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌తో పంచుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ.. వైరస్ వ్యాప్తిని, మరణాలను అడ్డుకునేందుకు పరిమిత సాధనాలతో శాయశక్తుల పనిచేస్తున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి: 'ఐవర్‌మెక్టిన్'తో కరోనా నుంచి రక్ష!
ఇదీ చూడండి: కరోనా టీకా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి?