ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా పెరగటం కలవరపెడుతోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్. గత రెండు నెలలుగా వారంలో నమోదయ్యే కేసులు రెండింతలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉందని స్పష్టం చేశారు. గతంలో కరోనాను కట్టడిచేయటంలో సఫలమైన దేశాల్లో ప్రస్తుతం కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. పపువా న్యూ గినియా దేశాన్ని ఉదాహరణగా వివరించారు.
" ఈ సంవత్సరం ప్రారంభం వరకు పపువా న్యూ గినియాలో 900 కంటే తక్కువ కేసులు, తొమ్మిది మరణాలు సంభవించాయి. కానీ ప్రస్తుతం 9వేలకు పైగా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. వ్యాక్సిన్ నిల్వలు ప్రతి దేశంలో సమానంగా ఎందుకు ఉండాలో ఈ దేశమే ఉదాహరణ."
-- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
40 మిలియన్ డోసుల కొవాగ్జిన్ టీకా 100కు పైగా దేశాల్లో సరఫరా అయిందన్నారు టెడ్రోస్.
ఇదీ చదవండి : మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి: మోదీ