ETV Bharat / international

కరోనా కొత్త వైరస్​ 'నియో కోవ్‌'పై డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?

WHO on NeoCoV: కొత్తరకం కరోనా వైరస్​ అయిన 'నియోకొవ్​'పై మరింత అధ్యయనం అవసరమని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వైరస్‌ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ కొత్త రకం వైరస్​ వేగంగా వ్యాప్తించటమే కాకుంగా మరణాల రేటు కూడా అధికంగానే ఉంటుందని వుహాన్​ శాస్త్రవేత్తలు పేర్కొన్న క్రమంలో డబ్ల్యూహెచ్​ఓ ఈ విధంగా స్పందించింది.

What WHO Said On NeoCov Coronavirus
డబ్ల్యూహెచ్‌ఓ
author img

By

Published : Jan 28, 2022, 10:42 PM IST

WHO on NeoCoV: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్‌ వైరస్‌ ఉన్నట్టు తేలిన పరిశోధనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో 'నియో కోవ్‌' ఉన్నట్టు వుహాన్‌ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే.. ఈ వైరస్‌ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ తెలిపింది.

మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని, మరీ ముఖ్యంగా అటవీ జంతువులని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. జంతువులతో పాటు వైరస్‌లకు సహజ రిజర్వాయర్‌గా గుర్తించిన గబ్బిలాల్లోనూ కరోనా వైరస్‌లు ఉంటాయంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే జునోటిక్‌ వైరస్‌లను ఎదుర్కోవడంలో తాము అత్యంత చురుగ్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను పంచుకున్న చైనా పరిశోధకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు, దక్షిణాఫ్రికాలో బయటపడిన 'నియో కోవ్‌' అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని తెలుస్తోంది. కొవిడ్‌ 19తో పోలిస్తే 'నియో కోవ్‌' వైరస్‌ కాస్త భిన్నమైనదే గాక, ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. 2012, 2015లో మధ్య ప్రాశ్చ్య దేశాల్లో విజృంభించిన మెర్స్‌- కోవ్‌ మాదిరిగా 'నియో కోవ్‌'తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. ఇక సార్స్‌ కోవ్- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కొత్త వైరస్​పై వుహాన్​ సైంటిస్టుల వార్నింగ్- ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.