ETV Bharat / international

ఉక్రెయిన్‌పై రష్యా ఉక్రోషం వెనుక కారణమేంటి?

ప్రపంచదేశాలు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్​ దేశాల మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. గత రెండు రోజుల్లో రష్యా సుమారు లక్షన్నరమంది సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. దీంతో ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

war situation between Russia and Ukraine
రష్యా-ఉక్రెయిన్​ దేశాల మధ్య యుద్ధవాతావరణం
author img

By

Published : Apr 21, 2021, 2:04 PM IST

ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతుంటే.. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కలవరపెడుతోంది. అవే రష్యా-ఉక్రెయిన్‌! గత రెండు రోజుల్లో రష్యా సుమారు లక్షన్నరమంది సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. కేవలం ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా.. అగ్రరాజ్యమైన అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ దేశాలు సైతం పరోక్షంగా ఇందులో భాగమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా ఇప్పుడిదో కీలకాంశంగా మారింది. జర్మనీ ఛాన్స్‌లర్‌ మెర్కెల్‌ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలని కోరారు. ఇంతకూ రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య గొడవేంటంటే..

బంధాలు దిగజారి..

ఈ రెండు దేశాల మధ్య సంబంధాలెన్నడూ సవ్యంగా లేవు. కొద్దిరోజులుగా ఇవి మరింత దిగజారి, ఉద్రిక్తతలు పెరిగాయి. 'యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉన్నామంతే' అంటూ ఇటీవల రష్యా టీవీలో వచ్చిన ప్రకటనతో అంతా ఉలిక్కిపడ్డారు! ఆ వార్తల్లో.. ఉక్రెయిన్‌ను ఏకంగా నాజీ రాజ్యంతో పోల్చారు. నాడు జర్మనీలో చేసినట్లే ఇప్పుడు ఉక్రెయిన్‌ను కూడా నాజీల నుంచి విముక్తం చేయాల్సిన పరిస్థితి రష్యాకు వస్తోందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌ ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉండి.. రష్యా అధికారం కింద ఉండేది. సోవియట్‌ యూనియన్‌ 1991లో విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశమైంది. కానీ రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు మొదట్నుంచీ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చాయి. 2014లో ఉక్రెయిన్‌ ప్రాంతమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ మధ్యకాలంలో సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా సైనిక కార్యకలాపాల వల్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి 26న నలుగురు ఉక్రెయిన్‌ సైనికుల్ని చంపేశారు. దీంతో గతేడాది కుదుర్చుకున్న కాల్పుల నియంత్రణను ఉల్లంఘించినట్లైంది. తన సార్వభౌమత్వాన్ని రష్యా సవాలు చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. "సరిహద్దుల్లో భారీగా బలగాలను దింపారు. యుద్ధమనేది ఇప్పుడు పుతిన్‌ చేతుల్లో ఉంది" అని ఉక్రెయిన్‌ జాతీయ రక్షణ, భద్రత మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. దీన్ని రష్యా విదేశాంగ ప్రతినిధి కొట్టిపారేస్తూ.. "రష్యా దాడి గురించి ఉక్రెయిన్‌ మీడియా భ్రమల్లో ఉంది" అని పేర్కొన్నారు.

సమస్యంతా అక్కడే..

నిజానికి సమస్యంతా ఉక్రెయిన్‌ భౌగోళిక, జన విభజనతోనే వచ్చింది. సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో రెండు ప్రధాన ప్రాంతాలున్నాయి. ఒకటి తూర్పు ప్రాంతం. ఇది చారిత్రకంగా, సాంస్కృతికంగా రష్యాకు చాలా దగ్గర. మిగిలిన ప్రాంతమంతా ఒకెత్తు. తూర్పు ప్రాంత ప్రజల్లో రష్యా సెంటిమెంటు ఎక్కువ. దీంతో ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌ వ్యతిరేక తిరుగుబాటుదారులకు మాస్కో మద్దతిస్తోంది. వెరసి రెండు దేశాల మధ్య సంఘర్షణకు బీజాలు పడ్డాయి. ఉక్రెయిన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించటానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇష్టపడరని అంటారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకుంటే రష్యా భౌగోళికంగా, ఆర్థికంగా బలపడుతుందన్నది పుతిన్‌ భావనగా చెబుతారు. అందుకే ఉక్రెయిన్‌ రాజకీయాల్ని, అక్కడి నేతల్ని ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తుంటుంది. అక్కడ తన అనుకూల నాయకత్వాన్ని కోరుకుంటుంది.

రెఫరెండంతో స్వాధీనం..

2014లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై తిరుగుబాటు జరిగింది. అదే అదునుగా క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుంది. అనంతరం అక్కడ రెఫరెండం నిర్వహించారు. ఉక్రెయిన్‌ మద్దతుదారులు బహిష్కరించిన ఆ ప్రజాభిప్రాయ సేకరణలో 90 శాతం మంది రష్యా అధికారానికి ఆమోదం తెలిపారు. కానీ.. అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి దీన్ని అంగీకరించలేదు. అయినా, ఆ ఏడాది మార్చి 18న రష్యా లాంఛనంగా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌ మాత్రం అదింకా తమదే అంటోంది. ఉక్రెయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన రష్యా.. అక్కడి చమురు నిల్వలపై కన్నేసింది. అందుకే దానిపై పట్టుబిగించాలని చూస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నాటోలో సభ్యత్వం కోరుతోంది. తద్వారా రష్యాను నిలువరించాలని చూస్తోంది. దీనికి రష్యా అంగీకరించటం లేదు. నల్లసముద్రం, అజోవ్‌ సముద్రాల ద్వారా భారీస్థాయిలో అంతర్జాతీయ వాణిజ్య రాకపోకలు సాగుతాయి. అవే ఉక్రెయిన్‌కు ఆర్థిక ఆధారం. ఇప్పుడు ఆ సముద్రాల్లో తన నౌకా దళాలను దించి దెబ్బతీయాలని రష్యా చూస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవలే పుతిన్‌కు ఫోన్‌ చేసి.. శిఖరాగ్ర సమావేశానికి, చర్చలకు ప్రతిపాదించటం గమనార్హం.

ఇదీ చూడండి: అంఫన్​తో భారత్​కు రూ.లక్ష కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.