ETV Bharat / international

విహారి: 'వోల్గా'పై లాహిరి లాహిరి లాహిరిలో...

వసంతకాలం వచ్చిందంటే ఐరోపాలోని అతిపెద్ద నది వోల్గా... పర్యటకులతో కొత్త కళ సంతరించుకుంటుంది. శీతాకాలం గడ్డకట్టుకుపోయిన మంచు... వసంత కాలంలో కరుగుతుంది. నదంతా జలమయమై నౌకాయానాలకు సిద్ధమవుతుంది.

'వోల్గా' నది
author img

By

Published : May 19, 2019, 2:04 PM IST

'వోల్గా' నదిపై నౌకాయానం ప్రారంభం

ఐరోపాలోనే అతిపెద్ద నది వోల్గా. శీతాకాలం నీరు గడ్డకట్టి స్తబ్దుగా ఉండే ఈ నది వసంతకాలం వచ్చిందంటే నౌకాయానాలతో కళకళలాడుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులను ఆకర్షిస్తోంది.

పర్యటకులకే కాకుండా ఆ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు, ప్రయాణికుల పడవల్లో పని చేసే సిబ్బందికీ ఈ'వసంతం' ఎంతో ముఖ్యం. ఎందుకంటే చాలా మందికి అదే జీవనాధారం.

ఈ ఏడాది వసంతకాల మొదటి ప్రయాణానికి నీష్నీ 'నోవ్​గరడ్ రివర్ స్టేషన్​' సిద్ధమైంది. ఇక్కడి నుంచే మొదటి ప్రయాణికుల ఓడ మాస్కో నగరానికి బయల్దేరుతుంది. నాలుగు రోజుల పాటు ప్రయాణించి మాస్కో చేరుకోనుంది ఈ ఓడ.

ఏటా ఎన్నో కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయని.. అయినా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుంటామని ఇక్కడ పని చేసే సిబ్బంది అంటున్నారు.

వోల్గా అందాలు చూడాలంటే ఓడలో ప్రయాణించడం తప్ప మరే విధంగానూ సాధ్యం కాదన్నది పర్యటకుల మాట.

"సెలవులను ఇలా పెద్ద ఓడలో గడపమని మా స్నేహితులు సలహా ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం మేము దీన్ని ప్రయత్నించాం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏటా ఇలా ప్రయాణిస్తున్నాము. మాకు ఇలా ప్రయాణించడం ఎంతో నచ్చింది."

- గాలినా ఎజోవా, పర్యటకురాలు

వసంత కాలంలో వోల్గా అందాలు ఆస్వాదించేందుకు స్థానికులే కాకుండా విదేశీ పర్యటకులు ఎంతో ఉత్సాహం కనబరుస్తుంటారు.

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0552: India Elections AP Clients Only 4211559
Voting in seventh phase of Indian elections
AP-APTN-0526: Australia Shorten No access Australia 4211558
Shorten: 'lessons to learn' after election defeat
AP-APTN-0421: Stills At Sea US Navy AP Clients Only 4211557
US aircraft carrier, strike group in Arabian Sea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.