ఇక్కడ మీరు చూస్తున్నది లండన్ టేట్ ఎగ్జిబిషన్. ఇందులో మీకు కనిపిస్తున్న కళాకృతులన్నీ ప్రకృతి సంబంధితమే. వీటిని సృష్టించిన వ్యక్తి ఓలాఫర్ ఎలిసన్.
ఇందులోకి అడుగు పెట్టేవాళ్లు ఇంకో లోకానికి వెళ్లిన అనుభూతి పొందుతారు. టేట్లో ప్రదర్శిస్తున్న ఈ కళాఖండాలు మిమ్మల్ని ప్రకృతికి మరింత దగ్గరగా తీసుకెళ్తాయి. వాన చినుకుల్లా చిందే నీరు, పాచితో కప్పిన గోడ, అబ్బురపరిచే ఇంద్రధనస్సు, రంగు రంగు నీడలు ప్రతిబింబించేలా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. ప్రకృతిలో మనిషి ఆస్వాదించగలిగే ప్రతి అనుభూతిని ఇక్కడ పొందవచ్చు.
ఈ ఎగ్జిబిషన్‌ను "రియల్ లైఫ్" అని అనడానికి కారణం ఉంది. ఈ మ్యూజియంలోకి అడుగుపెట్టే వాళ్లకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇందులోకి వస్తే మీరు వేరే ప్రపంచంలోకి వెళ్తున్నారనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రకృతికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది.
-ఓలాఫర్ ఎలిసన్
ప్రకృతిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలా మమేకమవుతున్నాము అనే అంశాల ఆధారంగా విభిన్న కళాఖండాలను సృష్టించానని ఓలాఫర్ తెలిపారు.
పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల 1990లో గ్రీన్‌ల్యాండ్‌లో మంచు గడ్డలు కరుగుతున్న చిత్రాలను కెమెరాలో బంధించి 42 చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. మళ్లీ ఈ ఏడాది వేసవికాలంలో వాటిని చిత్రీకరించి రెండిటిని పక్కపక్కనే పెట్టి మనిషి స్వార్థం వల్ల ప్రకృతి ఎంత విపత్తులో ఉందో చెప్పాలనుకుంటున్నట్లు వివరించారు. ఈ ప్రదర్శన ఈ ఏడాది జులై 5 నుంచి 2020 జనవరి వరకు జరుగుతుంది.
ఇదీ చూడండి:ఎలక్ట్రిక్ కారు... సొంతంగా తయారు చేశారు!