ETV Bharat / international

'వారికి ఇప్పుడు టీకా అవసరం లేదు'

చిన్నారులకు వ్యాక్సినేషన్​ డబ్ల్యూహెచ్​ఓ దృష్టిలో అంత ముఖ్యం కాదని ఆ సంస్థ వ్యాక్సిన్​ నిపుణురాలు కేట్ ఓ బ్రైన్ వెల్లడించారు. పిల్లలను పాఠశాలలకు పంపే ముందే వ్యాక్సినేట్ చేయడం కూడా అత్యవసరం ఏమీ కాదని వ్యాఖ్యానించారు.

పిల్లల వ్యాక్సినేషన్​పై డబ్ల్యూహెచ్​ఓ, children vaccination who expert
'పిల్లలకు టీకా ముఖ్యం కాదు'
author img

By

Published : Jun 4, 2021, 2:52 PM IST

చిన్నారులకు కరోనా టీకా వేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో ప్రాధాన్యాంశం కాదని డబ్ల్యూహెచ్​ఓ వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓ బ్రైన్ తెలిపారు. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని.. ప్రాణాంతం కూడా కాదని పేర్కొన్నారు.

పిల్లలను పాఠశాలలకు పంపే ముందే వ్యాక్సినేట్ చేయడం కూడా అత్యవసరం ఏమీ కాదన్న కేట్‌.. వాళ్లను పాఠశాలలో చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇవ్వడం మంచి ఆలోచనని అన్నారు.

అయితే ఇప్పటికే కెనడా, అమెరికా సహా కొన్ని ఐరోపా దేశాలు 12 నుంచి 15 ఏళ్ల లోపు వారికి టీకా ఇస్తున్నాయి. పిల్లలకు, అవసరం లేని వారికి వేస్తున్న టీకాలను పేద దేశాలకు ఇవ్వాలని ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నేటివరకు ఇచ్చిన టీకాల్లో 1 శాతం మాత్రమే పేద దేశాలకు అందాయి.

ఇదీ చదవండి : వ్యాక్సిన్ బూస్టర్‌ డోసులు అవసరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.