ETV Bharat / international

కరోనా పంజా- అమెరికాలో కొత్తగా లక్ష మందికి వైరస్​ - World corona death toll

కరోనా విజృంభణతో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్​ విజృంభణతో రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 4.58కోట్లు దాటింది. 11.93లక్షల మందిని మహమ్మారి బలితీసుకుంది. అమెరికాలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లక్షమందికిపైగా  వైరస్​ బారినపడ్డారు. అటు బ్రెజిల్​, ఇటలీ, స్పెయిన్​లోనూ  కరోనా మరోసారి పంజా విసురుతోంది.

US COVID-19 case count rises from 8mn to 9mn in 2 weeks
కరోనా పంజా- అమెరికాలో మరో లక్ష మందికిపైగా వైరస్​
author img

By

Published : Oct 31, 2020, 10:18 AM IST

ప్రపంచంపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.58 కోట్ల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. వారిలో 11లక్షల 93వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ బారినపడిన వారిలో 3కోట్ల 32లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1.14 కోట్ల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. అమెరికాలో రోజు వారీ కేసుల సంఖ్య లక్ష మార్క్​ను దాటింది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,01,461 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 93లక్షల 16వేల 297కు చేరింది. వైరస్​ ధాటికి మరో 988 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 2లక్షల 35వేలకు ఎగబాకింది. అగ్రరాజ్యంలో రెండువారాల వ్యవధిలోనే సుమారు 10లక్షల కేసులు నమోదయ్యాయని జాన్​హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అక్టోబర్​ 16న 80లక్షలుగా ఉన్న కేసుల సంఖ్య.. 14రోజుల్లోనే 90లక్షలకు చేరిందని పేర్కొంది.

  • బ్రెజిల్​లో వైరస్​ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. మరో 23వేల మంది కొవిడ్​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 55లక్షలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు లక్షా 59వేల 562మంది చనిపోయారు.
  • జర్మనీలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరో 18,681 కొవిడ్​ కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. ఆ దేశంలో ఇప్పటివరకు 10,349 మంది కరోనాతో మృతిచెందారు.
  • బ్రిటన్​లో మరో 24,405 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 89వేల 745కు చేరింది. మహమ్మారి ధాటికి ఇప్పటివరకు అక్కడ 46,229 మంది బలయ్యారు.
  • స్పెయిన్​లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. ఒక్కరోజులోనే 25,595 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 12లక్షల 64వేలకు ఎగబాకింది. కరోనాతో ఇప్పటివరకు అక్కడ 35,878 మంది మరణించారు.
  • ఇటలీలో రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.​ శుక్రవారం 31వేల మందికిపైగా కరోనా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 64లక్షల 76వేలు దాటింది. కొవిడ్​ సోకిన వారిలో 38,321 మంది మృతిచెందారు.
  • బెల్జియంలో ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 23వేల మందికిపైగా కొవిడ్​ బారినపడ్డారు. కేసుల సంఖ్య 40లక్షలకు చేరువైంది.
  • ఇరాన్​లో బుధవారం ఒక్కరోజే 6వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 5.88 లక్షలు దాటింది. మరో 415 మంది మృతితో.. మరణాల సంఖ్య33,714కు పెరిగింది.
  • పాక్​లో ఇప్పటివరకు 3లక్షల 32వేల మందికిపైగా వైరస్​ సోకింది. వారిలో 6,795 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో 12 మంది న్యాయమూర్తులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా ఆయా న్యాయమూర్తులు పనిచేసే 11 కోర్టులను మూసివేస్తున్నట్టు పాక్​ సర్కార్​ ప్రకటించింది.

ఇదీ చదవండి- 'యాంటీవైరల్​ పొర' మాస్కులతో కరోనాకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.