భారత్లో సరఫరా కొరత కారణంగా టీకా పంపిణీకి ఏర్పడ్డ అవాంతరాలను నివారించేందుకు రెండు కోట్ల డోసులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ప్రపంచదేశాలకు టీకా పంపిణీని సమాంతరంగా చేపట్టేందుకు నెలకొల్పిన 'కొవాక్స్' కార్యక్రమానికి ఈ టీకాలు అవసరమని తెలిపింది.
"2021 రెండో త్రైమాసికంలో కొవాక్స్కు అత్యవసరంగా 20 మిలియన్(రెండు కోట్ల) టీకా డోసులు అవసరం. సప్లై కొరత కారణంగా భారత్లో ఏర్పడ్డ టీకా పంపిణీ అవాంతరాలను పూడ్చేందుకు ఈ డోసులు ఆవశ్యకం."
-డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
కొవాక్స్కు కీలకమైన ఆస్ట్రాజెనెకా టీకాలు భారత్లోనే తయారవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ గుర్తుచేసింది. భారత్లోని సీరం సంస్థ.. ఈ టీకాలను ఉత్పత్తి చేసి కొవాక్స్కు అందిస్తోంది.
ఇదీ చదవండి: 2021 చివరి నాటికి ఫైజర్ కొవిడ్ ట్యాబ్లెట్స్!