ETV Bharat / international

పోషకాహార సమస్యను పెంచిన కరోనా!

కరోనా కారణంగా ఆకలి సమస్య పెరిగిపోయిందని ఐరాస వెల్లడించింది. 2020లో ప్రపంచ జనాభాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య 10 శాతంగా ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే 2030 నాటికి ఇంకా 66 కోట్ల మంది ఆకలి కోరల్లో విలవిలలాడుతుంటారని అంచనా వేసింది.

world hunger covid, covid hunger
కడుపు కొట్టిన కరోనా మహమ్మారి!
author img

By

Published : Jul 13, 2021, 7:45 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను. నానా రకాలుగా కుంగదీస్తోంది. తిండికీ నోచుకోని అభాగ్యుల సంఖ్యను పెంచేసింది. గత ఏడాది ఆకలి సమస్య మరింత తీవ్రమైందని ఐరాస పేర్కొంది. కరోనా విజృంభణే ప్రధాన కారణమని తెలిపింది. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని వివరించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మందికి పోషకాహార లోపం ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు సంవత్సరం అది 8.4 శాతంగా ఉండేదని తెలిపింది. ఐరాసకు చెందిన ఐదు సంస్థలు సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ ఆందోళనకర వివరాలు ఉన్నాయి. అందులోని ప్రధానాంశాలివీ..

  • ప్రధానంగా ఆఫ్రికాలో క్షుద్బాధ దారుణంగా పెరిగింది. అక్కడ 21 శాతం మందికి పౌష్టికాహార లోపం ఉంది.
  • ఆహారం లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఐదేళ్ల లోపు వయసున్న దాదాపు 14.9 కోట్ల మందిలో శారీరక ఎదుగుదల బాగా తక్కువగా ఉంది. 4.5 కోట్ల మంది పిల్లలు చాలా తక్కువ బరువును కలిగి ఉన్నారు.
  • మొత్తం మీద 3 వందల కోట్ల మంది పెద్దలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం.. అందని ద్రాక్షగానే ఉంది. అధిక ధరలే ఇందుకు కారణం.
  • ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహమ్మారి వల్ల తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యం తలెత్తింది. ఫలితంగా ఆహార లభ్యత తగ్గిపోయింది. నిజానికి కరోనా విజృంభణకు ముందు నుంచే ఆకలి పెరుగుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు మంద గమనంలో సాగుతున్నాయి.
  • మరోవైపు 3.9 కోట్ల మంది చిన్నారులకు ఊబకాయం ఉంది.
  • 2030 నాటికి ప్రపంచంలో క్షుద్చాధను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస లక్ష్యానికి కరోనా గండికొట్టేలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే 2030 నాటికి ఇంకా 66 కోట్ల మంది ఆకలి కోరల్లో విలవిలలాడుతుంటారు. అందులో దాదాపు 3 కోట్ల మంది.. కరోనా మహమ్మారి వల్ల ఉత్పన్నమయ్యే దీర్ఘకాల ప్రభావాలను ఎదుర్కొనేవారే.

ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ది నిధి (ఐఎఫ్‌ఏడీ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లు ఈ నివేదికను రూపొందించాయి.

ఇదీ చదవండి : Covid vaccine: ముక్కు ద్వారా ఇచ్చే​ టీకాలతో కరోనా​కు చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.