ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ నిధుల సమీకరణకు 'ఐరాస' పిలుపు - Antonio Guterres

కరోనా కట్టడికి పరిశోధనలు, చికిత్సా విధానాలను వేగవంతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆర్థిక సాయం చేయాలని కోరింది ఐక్యరాజ్య సమితి. అందుకు అవసరమైన 35 బిలియన్​ డాలర్లు అందించాలని పిలుపునిచ్చింది. సభ్య దేశాలతో పాటు ఇతరులు ముందుకు రావాలని కోరింది.

VIRUS-UN
డబ్ల్యూహెచ్​ఓ నిధుల సమీకరణకు 'ఐరాస' పిలుపు
author img

By

Published : Sep 11, 2020, 9:21 AM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్​, పరీక్షలు, చికిత్సావిధానాల అభివృద్ధి, పరిశోధనలు వేగవంతం చేసేందుకు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని కార్యక్రమాలకు తక్షణమే 35 బిలియన్​ డాలర్లు సాయం చేయాలని కోరింది ఐక్యరాజ్య సమితి(ఐరాస). నిధులు అందించేందుకు సభ్య దేశాలతో పాటు ఇతరులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్​.

డబ్ల్యూహెచ్​ఓ నేతృత్వంలో నిర్వహించిన 'యాక్ట్​ ఆక్సిలరేటర్'​ సమావేశంలో ఈ మేరకు దాతలను కోరారు గుటెరస్​.

"వచ్చే మూడు నెలల్లోపు 15 బిలియన్​ డాలర్లు అందించకపోతే.. కరోనా పరిశోధనలు ముందుకు తీసుకెళ్లటం, కొత్త పరీక్షలు, ఔషధాల తయారీ, సరఫరా పెంచే అవకాశాలను కోల్పోతాం. ప్రపంచం సాధారణ పరిస్థితికి వచ్చేందుకు అంతర్జాతీయ పరిష్కార అవకాశాలను మెరుగుపరిచేందుకు తక్షణ నిధుల సమీకరణ అవసరం. ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్​ఓకు కేవలం 3 బిలియన్​ డాలర్ల కంటే తక్కువ నిధులే అందాయి."

- ఆంటోనియా గుటెరస్​, ఐరాస ప్రధాన కార్యదర్శి

కరోనా వ్యాక్సిన్​ కోసం ఔషధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలు నిలిచిపోవటంపై హెచ్చరించారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్​ అధనోమ్​. అది కరోనా మహమ్మారి అంతం చేయటంలో పురోగతిని అడ్డుకోవచ్చని, అందరికీ సమానంగా వ్యాక్సిన్​ అందించే అంశంలో రాజీపడాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సురక్షితమని తేలనిదే ఏ వ్యాక్సిన్​ను ఆమోదించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.