హెర్డ్ ఇమ్యూనిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని హెచ్చరించారు. టీకా వేసుకున్నా ప్రజలు సామాజిక దూరం పాటించటం తప్పనిసరి అన్నారు. అంటువ్యాధులపై హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే దాదాపు 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికావాలని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. అయితే అంటువ్యాధి స్వభావం అధికంగా ఉండే కొవిడ్‌కు ఇది మరింత ఎక్కువ అవసరమని పలువురు భావిస్తున్నారు.
పేద దేశాల్లో ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మేరకు అన్ని దేశాలకు టీకా అందేలా కృషి చేయాలని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను కోరింది. పేద దేశాలకు టీకా అందించే అంశంపై ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి : ఒక్క డోసుతోనే కరోనాను అంతం చేసే టీకా!