విదేశీ ప్రయాణికుల కోసం బ్రిటన్ తీసుకొచ్చిన కొవిడ్ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన క్రమంలో రూల్స్‌ను సరళీకృతం చేసింది ఆ దేశ ప్రభుత్వం. కానీ భారత్‌కు మాత్రం ఎలాంటి లాభం చేకూరలేదు. బ్రిటన్ సరళించిన నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటన్‌లోకి అనుమతించే విదేశీ ప్రయాణికుల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించలేదు. కొవిషీల్డ్ టీకా తీసుకున్నప్పటికీ భారత ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.
అంతకుముందు.. భారత్‌పై బ్రిటన్ ఆంక్షలు విధించిన క్రమంలో.. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ను(India UK quarantine rules) తప్పనిసరి చేశాయి అధికార వర్గాలు. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
" మేము భారత్‌తో పాటు.. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నాం. నిబంధనలను దశలవారీగా తొలగిస్తాం."
-- బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి
భారత్ నిబంధనల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలు (India UK quarantine rules) చేయించుకోవడం తప్పనిసరి. అదే విధంగా వారు భారత్‌కు వచ్చి ఎనిమిది రోజులు పూర్తయ్యాక మరోసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: Pandora Papers Leak: 'పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలి'