ETV Bharat / international

'లాక్​డౌన్​ కారణంగా హగ్​లు మిస్సయ్యా' - బ్రిటన్​ యువరాజు ఛార్లెస్​

లాక్​డౌన్​ కారణంగా తన కుటుంబసభ్యులను హగ్​ చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు బ్రిటన్​ యువరాజు చార్లెస్. తన తండ్రిని చూసి కొన్ని వారాలైనట్లు ఓ ప్రముఖ ఛానల్​కు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు.

UK's Prince Charles on his own virus experience
లాక్​డౌన్​తో కుటుంబసభ్యుల కౌగిలింతకు దూరమైన ఛార్లెస్​
author img

By

Published : Jun 6, 2020, 12:14 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు చాలా మంది. కనీసం వారిని కలిసే అవకాశం కూడా లేకుండాపోయింది. లాక్​డౌన్​ ప్రభావం సామాన్య మానవులకే కాదు బ్రిటన్​ యువరాజు పైనా పడింది. లాక్​డౌన్ వల్ల తన కుటుంబసభ్యులను ఆప్యాయంగా కౌగలించుకోలేకపోతున్నట్లు ప్రిన్స్ చార్లెస్​ తెలిపారు. అలాగే తన తండ్రిని చూసి కొన్ని వారాలు అయినట్లు ఓ ప్రముఖ ఛానల్​కు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు చార్లెస్​. ఈ ముఖాముఖి వర్చువల్​ విధానం ద్వారా జరిగింది.

"దురదృష్టవశాత్తూ స్నేహితులకు దూరంగా ఉండటం నిజంగా చాలా బాధాకరం. కానీ కనీసం ఫోన్​ ద్వారా అయినా మాట్లాడగలుగుతున్నాం. కానీ రెండు ఒకటి కాదు కదా? ఇష్టమైనవారికి ఆప్యాయంగా హగ్​ ఇవ్వాలని ఎవరికి ఉండదు?"

- చార్లెస్,​ బ్రిటన్​ యువరాజు

ఈ సందర్భంగా ప్రిన్స్​ చార్లెస్​ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు ప్రిన్స్​ చార్లెస్.

ఇదీ చూడండి:అమెరికాలో కూలిన విమానం- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.