బ్రిటన్ ఎన్నికల్లో భారత్‌కు చెందిన అంశాలు ప్రధాన అస్త్రాలుగా నిలుస్తున్నాయి. కశ్మీర్ సమస్య, వ్యాపార అంశాలపై ఇప్పటికే బ్రిటన్ నేతలు విస్తృతంగా ప్రసంగిస్తున్నారు. తాజాగా జలియన్‌వాలా బాగ్ మారణహోమానికి భారత్‌కు అధికారికంగా క్షమాపణలు చెప్తామని హామీనిచ్చారు విపక్ష లేబర్ పార్టీ నేతలు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఈ ఏడాది.. జలియన్‌వాలా బాగ్ దురాగతానికి వందేళ్లు నిండిన సందర్భంగా భారత్‌కు అధికారిక క్షమాపణలు చెప్పడానికి బ్రిటన్ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ మాజీ ప్రధాని థెరెసా మే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
డిసెంబర్ 12న జరగనున్న ఎన్నికల కోసం 107 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్. దీనికి 'ఇట్స్ టైమ్ ఫర్ రియల్ ఛేంజ్' అని పేరు పెట్టారు.
గతంలో బ్రిటన్ చేపట్టిన వలస పాలనపై ఆడిట్ నిర్వహిస్తామని వాగ్దానం చేసింది లేబర్ పార్టీ. 1984 అమృత్‌సర్‌లో జరిగిన 'ఆపరేషన్ బ్లూ స్టార్'లో బ్రిటన్ పాత్రపై బహిరంగ సమీక్ష నిర్వహించడానికీ సిద్ధమని తెలిపింది.
ఆపరేషన్ బ్లూ స్టార్‌లో బ్రిటన్ పాత్ర ఉందని చెబుతూ 2014లో కొన్ని కీలక పత్రాలు బయటపడ్డాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు సిక్కు సంఘాలు... విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ చూడండి:- హిట్లర్ జ్ఞాపికలకు వేలంపాటలో రికార్డు ధర!