ETV Bharat / international

'యుద్ధం ఆగాలంటే.. నేరుగా నాతో చర్చలు జరపండి' - జెలెన్​స్కీ పుతిన్​

Ukraine war: రష్యా-ఉక్రెయిన్​ మధ్య బెలారస్​లో​ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. నేరుగా తనతో చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందన్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య జరిగిన రెండో వితడ చర్చల్లో మానవతా కారిడార్లు ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

Ukraine war
Ukraine war
author img

By

Published : Mar 4, 2022, 5:24 AM IST

Updated : Mar 4, 2022, 8:50 AM IST

Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఓవైపు రష్యాతో ఉక్రెయిన్‌ ప్రతినిధులు బెలారస్‌లో చర్చలు కొనసాగిస్తున్న సమయంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విలేకరుల సమావేశంలో మాట్లాడిన జెలెన్‌స్కీ.. '30 మీటర్ల దూరంలో కాకుండా నాతో కలిసి కూర్చొండి. నేనేమీ మిమ్మల్ని కరవను. మరి భయం ఎందుకు?' అని అన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో పుతిన్‌ పొడవాటి టేబుల్‌పై దూరదూరంగా కూర్చొని చర్చలు జరిపారు. దీనిని ఉద్దేశించే జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తమకు రక్షణ సాయం పెంచాలని పశ్చిమ దేశాలకు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. లేకుంటే యూరప్‌పై కూడా రష్యా దాడులు చేస్తుందన్నారు.

"మీకు ఆకాశంలో రష్యా వైమానిక దాడులను ఆపే శక్తి లేకుంటే మాకు విమానాలు ఇవ్వండి. ఈ యుద్ధం మాతోనే ముగిసిపోదు. లాత్వియా, లిథువేనియా, ఈస్తోనియాకు కూడా విస్తరిస్తుంది. నన్ను నమ్మండి. మేము రష్యాపై దాడి చేయట్లేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు. వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి" అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

మానవతా కారిడార్లను ఏర్పాటుకు అంగీకారం

మరోవైపు రష్యా-ఉక్రెయిన్​ మధ్య బెలారస్​లో గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో పురోగతి కనిపించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్​ దేశాలు అంగీకరించాయి. ఆయా కారిడార్లలో కాల్పుల విరమణ పాటించేందుకు నిర్ణయించాయి. కాల్పులు, రాకెట్​ దాడుల్లో సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. ఇరుపక్షాలు సైనిక సమస్యలు, మానవతా సమస్యలు, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. మూడో విడత చర్చల కోసం త్వరలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రష్యాకు ఈయూ షాక్.. కార్పొరేట్ సంస్థలూ దూరం..

Last Updated : Mar 4, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.