ETV Bharat / international

ఉచ్చుబిగుస్తున్నా వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్​​ మేయర్​ కిడ్నాప్​ - రష్యాపై ఆంక్షలు

Ukraine Russia War: ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న భీకర దాడులను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా అమెరికా మరిన్ని ఆంక్షల్ని అమలులోకి తెచ్చింది. మరోవైపు రష్యన్​ సేనలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. బాంబు దాడులతో ఉక్రెయిన్​లో భయాందోళనలు సృష్టిస్తోంది. మెలిటొపోల్​ను​ స్వాధీనం చేసుకున్న రష్యన్​ సైన్యం.. ఆ నగర మేయర్​ను కిడ్నాప్​ చేసింది.

ukraine russia war
ఉక్రెయిన్​ రష్యా
author img

By

Published : Mar 12, 2022, 12:12 PM IST

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికా శుక్రవారం మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిని తగ్గించాలని నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ విషయంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జీ-7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది. "పుతిన్‌ను ఎదుర్కొవడానికి స్వేచ్ఛా ప్రపంచం ముందుకు వస్తోంది" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేస్తే.. రష్యా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించే వెసులుబాటు అమెరికాకు కలుగుతుంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్విఫ్ట్‌ నుంచి రష్యాను తప్పించడం సహా ఆ దేశ చమురు ఉత్పత్తులపై బైడెన్‌ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌ఎన్‌ హోదా పోతే.. క్యూబా, నార్త్‌ కొరియా దేశాల సరసన రష్యా చేరుతుంది. ఇప్పటికే రష్యా ఎంఎఫ్‌ఎన్‌ హోదాను కెనడా రద్దు చేసింది.

రష్యా, బెలారస్​లకు ఎగుమతులపై ఆంక్షలు

రష్యాను కట్టడి చేసేందుకు వరుస ఆంక్షలను విధిస్తున్న అమెరికా మరో కీలక ప్రకటన చేసింది. రష్యా సహా ఆ దేశానికి సహకరిస్తున్న బెలారస్​లకు లగ్జరీ వస్తువులను ఎగుమతులు చేయడంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధి నెడ్​ ప్రిన్స్​ వెల్లడించారు. ఇప్పటికే ఐరోపా సమాఖ్య కూడా లగ్జరీ వస్తువులపై నిషేధం విధించింది.

యూట్యూబ్​ ఆంక్షలు

యూట్యూబ్​లోని రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానెళ్లను బ్లాక్​ చేస్తున్నట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు తెలిపింది.

మెలిటొపోల్​ మేయర్​ కిడ్నాప్​

దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. శుక్రవారం ఆ నగర మేయర్‌ను కిడ్నాప్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చాయి.

Ukraine Russia War
కిడ్నాప్​కు గురైన మెలిటొపోల్​ నగర మేయర్​ ఇవాన్‌ ఫెదొరోవ్‌
  • ⚡️Zelensky demands the release of the Mayor of occupied Melitopol.

    “The actions of Russian invaders equal to those of ISIS terrorists. If you act like terrorists then what’s even the point of talking with you,” he said.

    The alleged video of the kidnapping of Mayor Ivan Fedoriv. pic.twitter.com/xSXcirAjKp

    — Oleksiy Sorokin (@mrsorokaa) March 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్‌ మేయర్‌ ఇవాన్‌ ఫెదొరోవ్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్‌ కిరిల్‌ తిమోషెంకో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. శత్రు సైనికులకు సహకరించట్లేదని అయనను అపహరించినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. "రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలు ఐసిస్‌ ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదు" అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. మెలిటొపోల్‌ నగరాన్ని ఫిబ్రవరి 26నే రష్యా హస్తగతం చేసుకుంది.

ప్రతి 30 నిమిషాలకు దాడులు..

మరోవైపు రాజధాని కీవ్‌ను అధీనంలోకి తీసుకునేందుకు రష్యా సేనలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కీవ్‌పై భారీ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. పేలుడు శబ్దాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు మరియుపోల్‌లోనూ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. గత 11 రోజులుగా మరియుపోల్‌ వ్యాప్తంగా విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రతి 30 నిమిషాలకోసారి ఫిరంగుల దాడులు జరుగుతున్నాయని నగర మేయర్‌ తెలిపారు. ఇప్పటికే 1200 మంది మరణించి ఉంటారని ఆయన అంచనా వేశారు.

ఇన్​స్టాగ్రామ్​ బ్లాక్​

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఇన్​స్టాగ్రామ్​పై రష్యా నిషేధం విధించడాన్ని ఆ సంస్థ చీఫ్​ ఆడమ్​ ముస్సేరీ తప్పుపట్టారు. రష్యా చర్య సరికాదని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం

యుద్ధంలో నేరుగా పాల్గొనం తప్ప.. ఉక్రెయిన్‌ ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రతిన బూనిన అమెరికా.. అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. ఆ దేశానికి సైనిక, మానవతా సాయం కింద 13.6 బిలియన్‌ డాలర్లను అందివ్వనుంది. ఈమేరకు బైడెన్‌ ప్రభుత్వం రూపొందించిన ప్యాకేజీకి గురువారం కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేసింది. "పుతిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ ప్రజలు ఒంటరి కాబోరని మేం హామీ ఇచ్చాం. ఈ ప్యాకేజీని ఆమోదిస్తే ఆ హామీని నిలబెట్టుకొన్నవారం అవుతాం" అని ఓటింగ్‌కు ముందు సెనెట్‌ మెజారిటీ నాయకుడు చక్‌ షుమర్‌ తెలిపారు. ప్యాకేజీలో సగభాగం సైనిక అవసరాలకు ఖర్చు చేశారు. మిగిలిన భాగాన్ని మానవతా, ఆర్థిక సాయంగా ఉక్రెయిన్‌కు అందిస్తారు.

రష్యా పార్లమెంట్‌ సభ్యులపై బిటన్‌ ఆంక్షలు

ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతిచ్చిన రష్యా పార్లమెంటులోని దిగువసభ అయిన డ్యూమాలోని 386 సభ్యులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. దీంతో ఇక ఈ సభ్యులెవరూ యూకేలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేరు. వీరికి ఉన్న ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తారు.

ఇవీ చూడండి :

రష్యా ఇంధనంపై ఆధారపడకూడదని ఈయూ నిర్ణయం!

'నాటో బరిలోకి దిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే!'- బైడెన్​ వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.