ETV Bharat / international

బ్రిటన్​ ఆఫర్​.. ఉక్రెయిన్‌ శరణార్థికి ఆశ్రయం ఇస్తే 450 డాలర్లు! - ఉక్రెయిన్ రష్యా వార్తలు

Ukraine Russia News: ఉక్రెయిన్​ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడం కోసం బ్రిటన్​ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో స్థానికులు శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆదుకుంటే వారికి శరణార్థికి 450 డాలర్ల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది.

Ukraine Russia News
బ్రిటన్​ ఆఫర్​
author img

By

Published : Mar 14, 2022, 4:39 AM IST

Ukraine Russia News: ఉక్రెయిన్‌ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చే శరణార్థులకు బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 'హోమ్స్‌ ఫర్‌ ఉక్రెయిన్‌' ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బ్రిటన్‌ వాసులు ఎవరైన ఉక్రెయిన్‌ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ప్రభుత్వం ప్రతినెల ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పున చెల్లిస్తుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె వెల్లడించారు. నీడ అవసరమైన వారికి మనమందరం కలిసి సురక్షితమైన ఇంటిని ఇద్దాము అని మిషెల్‌ గోవె పేర్కొన్నారు.

ఈ పథకంలో శరణార్థులకు కనీసం ఆరు నెలల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారవర్గాల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు ఎవరైనాఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ రకంగా ఆశ్రయం ఇచ్చిన వారికి నెలకు 450 డాలర్లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

శరణార్థులకు యూకే వీసాలు..

ఉక్రెయిన్‌ ప్రజలకు 3వేల వీసాలు జారీ చేసినట్లు యూకే వెల్లడించింది. గురువారం నుంచి ఉక్రెయిన్‌ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని.. కేవలం ఆ దేశ పాస్‌పోర్టు ఉంటే చాలని పేర్కొంది. ఈ విషయాన్ని యూకే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రం నుంచి వచ్చే ప్రజలకు వీలైనంత సాయం చేస్తామని వెల్లడించారు. వారికి విద్యా,ఉద్యోగ, వైద్యంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : పొలాండ్​ సరిహద్దుల్లో రష్యా దాడి.. 35 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.