ETV Bharat / international

ప్రధాని మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు.. ఏమన్నారంటే? - ఉక్రెయిన్​ యుద్ధం

Zelenskyy speaks with Modi: రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో.. భారత్​ నుంచి రాజకీయ మద్దతు కోరినట్లు చెప్పారు. మరోవైపు.. రష్యా ప్రణాళికలను దెబ్బకొట్టామని, కీవ్​ తమ అధీనంలో ఉందని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

zelenskyy-modi
ప్రధాని మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు
author img

By

Published : Feb 26, 2022, 7:26 PM IST

Zelenskyy speaks with Modi: ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు. రష్యా దురాక్రమణను నియంత్రిస్తున్నట్లు ప్రధానికి తెలిపిన జెలెన్​ స్కీ.. ఐరాస భద్రతా మండలిలో తమకు భారత్​ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు. దురాక్రమణను కలిసి పోరాడదామని పేర్కొన్నారు.

" భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణను తిప్పికొట్టినట్లు తెలియజేశా. 1,00,000 మందికిపైగా చొరబాటుదారులు మా దేశంలో ఉన్నారు. నివాస భవనాలపై దాడులు చేస్తున్నారు. ఐరాస భద్రతా మండలిలో రాజకీయంగా మద్దతు ఇవ్వాలని భారత్​ను కోరాను. దురాక్రమణను కలిసికట్టుగా అడ్డుకుందాం."

- వొలొదిమిర్​ జెలెన్​స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు.

శాంతిస్థాపనకు భారత్​ కృషి: మోదీ

ఉక్రెయిన్​లో కొనసాగుతున్న సైనిక చర్య కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై.. ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. వెంటనే దాడులను ఆపి, చర్చలు ప్రారంభించాలని ఉద్ఘాటించినట్లు పీఎంఓ తెలిపింది. శాంతి స్థాపన కోసం భారత్​ అన్ని విధాల కృషి చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ఉక్రెయిన్​లోని భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించింది.

రష్యా ప్రణాళికను దెబ్బతీశాం.. కీవ్‌ మా ఆధీనంలోనే ఉంది

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. తన ప్రభుత్వాన్ని కూలదోసి, ఒక తోలుబొమ్మను కొలువుదీర్చాలని పుతిన్‌ చూస్తున్నారని ఆరోపించారు. తమపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న దాడిని ఆపేలా రష్యన్లు ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే ఈ సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న రష్యన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

'రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్‌ ఇప్పటికీ ఉక్రెయిన్‌ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి' అని జెలెన్‌స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యన్‌ సేనలు 'క్షిపణులు, ఫైటర్‌లు, డ్రోన్‌లు, ఫిరంగిదళాలు, సాయుధ వాహనాలు, విధ్వంసకారులు, వైమానిక దళాలు' ను మోహరించాయి. నివాస ప్రాంతాలపై కూడా దాడి చేశాయని మండిపడ్డారు. కీవ్‌తో సహా ప్రధాన నగరాల్లో ఉక్రేనియన్లు రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వెల్లడించారు. మరికొన్ని నగరాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే యూరోపియన్ యూనియన్​లో (ఈయూ) చేరే హక్కును ఉక్రెయిన్‌ ఇప్పటికే పొందిందని, ఈయూ నేతలు అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా స్విఫ్ట్‌ నుంచి రష్యాను డిస్‌కనెక్ట్‌ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు. జర్మనీ, హంగరీ కూడా ఇప్పుడు ఆ ధైర్యం చేస్తాయన్నారు. ఇంకోపక్క ఈ సైనిక చర్యను వ్యతిరేకించిన రష్యన్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తీరుగా పుతిన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని అభ్యర్థించారు. మనకు, ఈ ప్రపంచానికి అబద్ధాలు చెప్పేవారిని నిలువరించాలని కోరారు. 'వేల సంఖ్యలో బాధితులు, వందల సంఖ్యలో ఖైదీలుగా ఉన్నారు. యుద్ధం తక్షణం ఆగిపోవాలని మీరు ఎంత త్వరగా ప్రభుత్వానికి చెబితే.. అంత ఎక్కువమంది బతుకుతారు' అని జెలెన్‌స్కీ తాజా వీడియో సందేశంలో వెల్లడించారు.

ఇదీ చూడండి:

Indians in Ukraine: 219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.