ETV Bharat / international

ఉక్రెయిన్‌ దాడిలో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి - రష్యా ఉక్రెయిన్​ యుద్ధం

Ukraine Crisis: ఉక్రెయిన్‌ చేసిన దాడిలో మరో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి చెందారు. ఖర్కివ్​ సమీపంలో తమ బలగాలు జరిపిన దాడుల్లో రష్యా మేజర్‌ జనరల్‌ విటాలి గెరాసిమోవ్‌ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ధ్రువీకరించింది.

Ukrainne Crisis
ఉక్రెయిన్‌ దాడిలో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి
author img

By

Published : Mar 8, 2022, 7:28 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​పై గత 13 రోజులుగా క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ఆ దేశంలోని కీలక నగరాను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి రష్యన్​ సేనలు. అయితే.. ఉక్రెయిన్​ సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ సవాల్​ విసురుతోంది. తాజాగా.. ఉక్రెయిన్‌ చేసిన దాడిలో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి చెందారు.

ఖర్కివ్​ సమీపంలో తమ బలగాలు జరిపిన దాడుల్లో రష్యా 41వ ఆర్మీ బెటాలియన్‌ అధిపతి, డిప్యూటీ కమాండర్‌, మేజర్‌ జనరల్‌ విటాలి గెరాసిమోవ్‌ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ధ్రువీకరించింది. ఈ దాడిలో మరికొంత మంది అధికారులు చనిపోయారని, కొందరికి గాయాలు అయ్యాయని పేర్కొంది.

ఇదీ చూడండి: విరామం అంటూనే.. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల మోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.