ETV Bharat / international

రష్యా దాడిలో 280 ఉక్రెయిన్​ విద్యాసంస్థలు ధ్వంసం

Ukraine crisis- Russia Ukraine war live update
ఉక్రెయిన్​- రష్యా యుద్ధం లైవ్​ అప్డేట్స్​
author img

By

Published : Mar 10, 2022, 6:30 AM IST

Updated : Mar 11, 2022, 5:01 AM IST

04:58 March 11

  • Russian forces had destroyed or damaged 280 educational institutions through bombing and shelling, reports The Kyiv Independent quoting Ukraine’s Minister of Education and Science Serhiy Shkarlet

    — ANI (@ANI) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రష్యా దళాలు బాంబు దాడులతో 280 విద్యాసంస్థలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ విద్య, సైన్స్ మంత్రి సెర్హి ష్కార్లెట్ తెలిపారు.

04:49 March 11

  • US Vice President Kamala Harris announced nearly $53 million in new humanitarian assistance from United States government, through the US Agency for International Development (USAID), to support innocent civilians affected by Russia’s unjustified invasion of Ukraine.

    (File Pic) pic.twitter.com/D0k7SIPH3H

రష్యా దాడిలో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్​కు అమెరికా మరోసారి సహాయాన్ని ప్రకటించింది. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్​ఏఐడీ) ద్వారా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నుంచి దాదాపు 53 మిలియన్ల కొత్త మానవతా సహాయాన్ని యూఎస్​ ఉపాధ్యక్షురాలు కమల హారిస్​ ప్రకటించారు.

14:40 March 10

రష్యా, ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రుల భేటీ..

రష్యా, ఉక్రెయిన్​ యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు తొలి ఉన్నత స్థాయి చర్చల కోసం టర్కీలోని ఓ రిసార్ట్​లో భేటీ అయ్యారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్​, ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి కులేబాతో పాటు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్​ కవుసోగ్లు కూడా సమావేశానికి హాజరయ్యారు.

14:14 March 10

మెరియుపోల్​లో ఆస్పత్రిపై రష్యా దాడి..

ఉక్రెయిన్​ మెరియుపోల్​లోని ఆస్పత్రిపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

10:12 March 10

రష్యా నుంచి దిగుమతులపై నిషేధానికి హౌస్​ ఆమోదం..

ఉక్రెయిన్​తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు యూఎస్​ హౌస్​ ఆమోదం తెలిపింది.

06:58 March 10

ఉక్రెయిన్​పై రసాయన ఆయుధాలతో దాడికి అవకాశం: అమెరికా

ఉక్రెయిన్​పై రష్యా దాడులు మరింత తీవ్రతరంగా కానున్నాయని, రసాయన, జీవసంబంధిత ఆయుధాలతో దాడి చేసే యోచనలో ఉన్నట్లు హెచ్చరించింది అమెరికా. అగ్రరాజ్య సాయంతో ఉక్రెయిన్​లో రసాయన ఆయుధాలను తయారు చేస్తున్నారన్న రష్యా వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఆ ఆయుధాలను వినియోగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అంతర్భాగమని పేర్కొంది. రష్యా చేసిన ఈ తప్పుడు వాదనలకు చైనా మద్దతు పలుకుతోందని, రసాయన ఆయుధాలను ఉపయెగించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న కుట్రగా ఆందోళన వ్యక్తం చేసింది శ్వేతసౌధం.

పోలాండ్​ పర్యటనలో కమలా హారిస్​

రష్యా దాడితో ఉక్రెయిన్​ను వీడుతున్న వందల మందికి ఆశ్రయం కల్పిస్తున్న పోలాండ్​కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ దేశంలో పర్యటిస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​. అయితే, ఆమె పర్యటన ముగియకముందే ఊహించని మలుపు తిరిగింది. ఉక్రెయిన్​కు యుద్ధ విమానాలు అందించే విషయంలో ఇరు దేశాల మధ్య విబేధాలు వచ్చాయి. పోలాండ్​ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న అంశంగా పేర్కొంది. ఈ సమయంలోనే వార్సాకు చేరుకున్నారు కమలా హారిస్​. ఈ క్రమంలో పోలాండ్​, రొమేనియాల పర్యటన కీలకంగా మారనుంది.

06:43 March 10

ఉక్రెయిన్​కు పోలాండ్​ యుద్ధ విమానాలు.. వ్యతిరేకించిన అమెరికా!

పుతిన్​ సేనలను దీటుగా ఎదుర్కొనేలా ఉక్రెయిన్​కు వైమానిక సాయం అందించాలన్న దృఢ నిశ్చయాన్ని పోలాండ్​ మరోసారి బహిర్గతం చేసింది. తమ వద్దనున్న మిగ్​-29 యుద్ధ విమానాలను జర్మనీలోని అమెరికా వాయుసేన స్థావరం ద్వారా ఉక్రెయిన్​కు అందుబాటులో ఉంచుతామని పోలాండ్​ ప్రధాని మాథ్యూస్​ మోరావీకి బుధవారం వెల్లడించారు. అయితే, ఇది చాలా తీవ్ర నిర్ణయమేనని, దీని కారణంగా భద్రతాపరంగా సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. తాము సమకూర్చే యుద్ధ విమానాలను ఉక్రెయిన్​కు అందించాలా? లేదా? అన్నది ఇక నాటో, అమెరికా చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ విమానాలను అప్పగించడం వంటి కీలక అంశాలపై నార్త్​ అట్లాంటిక్​ అలయెన్స్​ ఏకపక్షంగా, నిస్సందేహంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

తిరస్కరించిన అమెరికా..

ప్రస్తుత సమయంలో ఉక్రెయిన్​ వాయుసేనకు యుద్ధ విమానాలను అందించటానికి తాము మద్దతు ఇవ్వటం లేదని స్పష్టం చేశారు పెంటగాన్​ ప్రెస్​ సెక్రటరీ జాన్​ కిర్బి. ఆయుధాలు, క్షిపణి విధ్వంసక వ్యవస్థల వంటివి అందించి రష్యా దురాక్రమణను ఓడించేందుకు ఉక్రెయిన్​కు సాయం చేయటాన్ని నమ్ముతామన్నారు. ఆ దేశ వాయుసేన వద్ద ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నారు. అదనంగా యుద్ధ విమానాలను అందించటం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుందని అనుకోవటం లేదన్నారు. మిగ్​-29 అందించటం ద్వారా లభించే ఫలితం తక్కువే అనుకుంటున్నామని, ఇది యుద్ధ తీవ్రతను పెంచటం, నాటోతో రష్యా సైనిక చర్యలు చేపట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది చాలాప్రమాదంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఉక్రెయిన్​కు సాయంగా భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

భగ్గుమన్న రష్యా!

పోలాండ్​ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించింది రష్యా. ఇది అవాంఛనీయమని, ఈ చర్య అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని క్రెమ్లిన్​ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ హెచ్చరించారు. ఉక్రెయిన్​ వాయుసేనకు ఏ దేశమైనా తోడ్పాటు అందిస్తే.. అది తమకు వ్యతిరేకంగా యుద్ధంలో పాలుపంచుకున్నట్టే భావించి, ప్రతీకార చర్యలకు దిగుతామని రష్యా తీవ్రంగా హెచ్చరించింది.

06:23 March 10

Russia Ukraine War: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం లైవ్​ అప్డేట్స్​

Russia Ukraine War: కత్తిగట్టినట్లు ఉక్రెయిన్‌పై నిప్పులు కురిపిస్తున్న రష్యా సేనలు చివరకు ఆసుపత్రులనూ, శ్మశానాలనూ వదిలిపెట్టడంలేదు. మేరియుపొల్‌లో బుధవారం చోటు చేసుకున్న దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పిల్లలు సహా పలువురు రోగులు ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. ఈ దాడిని రష్యా చేసిన దురాగతంగా అభివర్ణించారు. విధ్వంస దృశ్యాలను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అడుగడుగునా శిథిలాలు, మెలితిరిగిన ఉక్కు కడ్డీలు, పగిలిపోయిన కిటికీలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. దాడులు కొత్త మలుపు తీసుకుంటున్నాయనే హెచ్చరిక జారీ చేసినట్లయింది.

ఒకపక్క బాంబులు, క్షిపణుల మోత.. మరోపక్క సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు.. ఈ రెండు దృశ్యాలు ఉక్రెయిన్‌లో కనిపించాయి. కీవ్‌తో పాటు మేరియుపోల్‌, ఎనెర్హొదర్‌, వొల్నోవాఖా, లిజియుమ్‌, సుమీ ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోయేందుకు వీలుగా రోజు మొత్తం దాడులకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రసూతి ఆసుపత్రి ఇలా శిథిలాల గుట్టగా మారడం ప్రజల్ని కలచివేసింది.

Last Updated : Mar 11, 2022, 5:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.