బ్రెగ్జిట్‌పై పార్లమెంటులో ప్రతిష్టంభన గురించి మంత్రులతో ఏడు గంటల పాటు చర్చించారు థెరీసా మే. అనంతరం ఈయూని మరింత సమయం కోరతామని ప్రకటించారు. అలాగే ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత జెరెమి కోర్బిన్‌ను చర్చలకు ఆహ్వానించారు. పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉమ్మడి విధానం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.
" ఒప్పందంతో ఈయూ నుంచి విడిపోవడమే మంచి పరిష్కారం. పార్లమెంటులో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందేంత వరకు ఆర్టికల్ 50కి గడువు పొడిగింపు అవసరం. " -- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని
మార్చి 29తో ముగియనున్న బ్రెగ్జిట్ గడువును ఏప్రిల్ 12 వరకు పొడిగించేందుకు ఇప్పటికే ఈయూ నేతలు అంగీకరించారు. 12న ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత సమయం కోరనున్నట్టు ప్రకటించారు మే.
ఇప్పటికే బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటులో మూడుసార్లు తిరస్కారానికి గురైంది.