ETV Bharat / international

బ్రిటన్​లో 'వీ'డే- 90ఏళ్ల మ్యాగీకి తొలి టీకా - కరోనా టీకా బ్రిటన్​

కొవిడ్​ టీకా పంపిణీని బ్రిటన్​ ప్రారంభించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:31 గంటలకు.. 90ఏళ్ల వృద్ధురాలు తొలి టీకాను పొందారు. వ్యాక్సిన్​ పొందడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.

First patient in UK receives Pfizer Covid-19 vaccine
బ్రిటన్​లో 'వీ'డే- 90ఏళ్ల మహిళకు తొలి టీకా
author img

By

Published : Dec 8, 2020, 11:32 AM IST

Updated : Dec 8, 2020, 3:21 PM IST

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టానికి బ్రిటన్​ శ్రీకారం చుట్టింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని మంగళవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఉత్తర ఐర్లాండ్​కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలికి మొదటి ఫైజర్ టీకాను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఫైజర్​ టీకాను పొందిన తొలి వ్యక్తి(ప్రయోగాలు మినహా)గా మార్గరెట్​ కీనన్(మ్యాగీ)​ చరిత్రలో నిలిచిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:31 గంటలకు కావెన్ట్రీ ఆసుపత్రి నర్సు మే పార్సన్స్​.. మ్యాగీకి టీకాను ఇచ్చారు.

వ్యాక్సిన్​ పొందడం ఎంతో సంతోషంగా ఉందని మార్గరెట్​ కీనన్​ పేర్కొన్నారు.

"కరోనా టీకా వేయించుకున్న తొలి మనిషిని నేనే కావడం ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే వారం నా పుట్టినరోజు. ఇది నాకు ముందస్తు పుట్టినరోజు కానుక వంటింది. ఈ ఏడాదంతా నేను ఒంటరిగానే ఉన్నా. టీకా వల్ల ఇప్పుడు ఇక కుటుంబం, స్నేహితులతో కలిసి న్యూ ఇయర్​ వేడుకలు చేసుకోవచ్చు."

--- మార్గరెట్​ కీనన్​, ఉత్తర ఐర్లాండ్​వాసి.

నాలుగేళ్ల ముందు వరకు ఓ నగల దుకాణంలో అసిస్టెంట్​గా పనిచేశారు మార్గరెట్​. ఆమెకు ఇద్దరు సంతానం, నలుగురు మనవళ్లు ఉన్నారు.

మార్గరెట్​కు 21 రోజుల తర్వాత మరో డోసును ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:- ఈయూతో ఒప్పందం లేకపోయినా టీకా ఆగదు!

ఇతర దేశాల్లో...

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు.. బ్రిటన్​ బాటలోనే ప్రయాణిస్తున్నాయి. తమ దేశ ప్రజలకు టీకాను అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నాయి.

  • వచ్చే ఏడాది జనవరి 25 నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు బ్రెజిల్​ సావో పాలో రాష్ట్ర గవర్నర్​ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో 46మిలియన్​ మంది ప్రజలున్నారు. చైనా అభివృద్ధి చేస్తున్న కరోనావాక్​ను సావో పాలో లోని బుటన్​టన్​ ఇన్​స్టిట్యూట్​ ఉత్పత్తి చేయనుంది. అయితే దీనికి బ్రెజిల్​ ఆరోగ్యశాఖ నుంచి ఇంకా అనుమతి లభించలేదు.
  • ఈ నెల చివరి నాటికి దేశానికి 2.5లక్షలకుపైగా ఫైజర్​ టీకా డోసులు లభించనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో ప్రకటించారు. ఇందుకు సంబంధించి గురువారం వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి కెనడా ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
  • ఇండోనేషియాలో.. చైనాకు చెందిన సినోవాక్​ బయోటెక్​ రూపొందిస్తున్న టీకాకు హలాల్​ సర్టిఫికేట్​ లభించే అవకాశముంది. 10లక్షలకుపైగా సినోవాక్​ టీకాలు ఇప్పటికే ఇండోనేషియా చేరుకున్నాయి.
  • స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్​ను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సరఫరా చేస్తోంది రష్యా. మిలిటరీ సిబ్బంది, వైద్య సిబ్బంది, టీచర్లకు వీటిని అందించేందుకు ప్రణాళికలు రచించారు. శనివారం మాస్కోలో సామూహిక వ్యాక్సినేషన్​ను ప్రారంభించింది రష్యా.

ఇదీ చూడండి:- ఆలింగనాలు వద్దు: డబ్ల్యూహెచ్​ఓ సూచన

Last Updated : Dec 8, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.