ETV Bharat / international

కొత్త ఆంక్షలతో  బ్రిటన్​లో మళ్లీ లాకడౌన్​! - యూకే కరోనా లాక్​డౌన్​

బ్రిటన్​లో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​ అలర్ట్​ను మూడు నుంచి నాలుగుకు పెంచింది ప్రభుత్వం ​. దీనితో పాటు గురువారం నుంచి దేశవ్యాప్తంగా పలు ముఖ్యమైన నిబంధనలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. బాధితులు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

UK raises coronavirus alert as infections rise 'exponentially', heightened curbs from Thursday
ఆందోళనకరంగా వైరస్​ వ్యాప్తి- అక్కడ మళ్లీ లాక్​డౌన్​
author img

By

Published : Sep 22, 2020, 8:38 AM IST

బ్రిటన్​లో కరోనా వ్యాప్తి మరోమారు ఆందోళనకరంగా మారింది. కరోనా విజృంభణకు చిహ్నంగా.. వైరస్​​ అలర్ట్​ వ్యవస్థను మూడు నుంచి నాలుగుకు పెంచింది అక్కడి ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని దీని అర్థం.

ఈ నేపథ్యంలో పలు నూతన ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. గురువారం నుంచి ఆసుపత్రి రంగంలో కీలక నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బార్లు, పబ్స్​, రెస్టారెంట్లను రాత్రి 10గంటలకే మూసివేయాలని ఆదేశాలిచ్చింది. హౌస్​ ఆఫ్​ కామన్స్​లో ఈ కొత్త నిబంధనలను మంగళవారం ప్రవేశపెట్టనున్నారు యూకే ప్రధాని బోరిస్​ జాన్సన్​.

పెరుగుతున్న కేసులపై ఇంగ్లాండ్​, స్కాట్​ల్యాండ్​​, ఉత్తర ఐర్లాండ్​, వేల్స్​ ప్రాంతాలకు చెందిన సీఎమ్​ఓలు(చీఫ్​ మెడికల్​ ఆఫీసర్స్​) ఓ ప్రకటనను విడుదల చేశారు.

"దేశంలో కరోనా కేసులు, మరణాలు కొంతకాలం తగ్గిన అనంతరం.. మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వైరస్​ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్​ లెవల్​ను 3 నుంచి నాలుగుకు పెంచమని సంయుక్త బయో సెక్యూరిటీ సెంటర్​ సిఫార్సు చేసింది. నేషనల్​ హెల్త్​ సర్వీస్​కు బాధితుల తాకిడితో పాటు భారీ స్థాయిలో మృతుల సంఖ్యను నివారించాలంటే.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి. మాస్కులు ధరించాలి. ఇది ప్రజలకు ఆందోళనకరమైన వార్తే అయినప్పటికీ.. నిబంధనలను పాటించాల్సిందే."

-- చీఫ్​ మెడికల్​ ఆఫీసర్స్​. ​

ప్రస్తుతం.. ఇంగ్లాండ్​లోని ఉత్తర ప్రాంతాల్లో కఠినమైన లాక్​డౌన్​ అమలవుతోంది. మంగళవారం నుంచి ఇతర ప్రాంతాలు కూడా లాక్​డౌన్​లోకి రానున్నాయి.

బ్రిటన్​ ప్రస్తుతం 3,98,625 కేసులున్నాయి. కరోనా ధాటికి ఇప్పటివరకు 41,788మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక రోబో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.