ETV Bharat / international

వన్యప్రాణుల మధ్య విందు అదరహో..! - భోజనం

మనమంతా రెస్టారెంట్లలో భోజనం చేసి ఉంటాం..పార్కుల్లో విందు చేసి ఉంటాం..కానీ అడవిలో.. అది కూడా వన్యప్రాణులతో కలిసి తినడం ఎప్పుడైనా విన్నారా..? ఆ అనుభూతిని కల్పిస్తోంది లండన్​లోని ఓ అంతర్జాతీయ జూపార్కు.

లండన్​: వన్యప్రాణుల మధ్య విందు అదరహో..!
author img

By

Published : Jul 29, 2019, 10:30 AM IST

లండన్​: వన్యప్రాణుల మధ్య విందు అదరహో..!

జిరాఫీతో కలిసి భోజనం చేయాలనుందా?...లండన్​లోని 'ల్యాండ్​ ఆఫ్​ ది లయన్స్' లాడ్జ్​లో ఒకరోజు రాత్రి గడిపితే చాలు.. మీ కల తీరుతుంది. ఇక్కడ పెగ్విన్లతో కలిసి అల్పాహారం చెయ్యవచ్చు. సౌకర్యవంతమైన గదులతో మీకు అక్కడి లాడ్జీలు స్వాగతం పలుకుతాయి. ఇక్కడున్న 9 లాడ్జీలకు వివిధ జంతువుల పేర్లను పెట్టారు. ప్రత్యేకమైన వరండా, స్నానపు గదులను ఏర్పాటు చేశారు. దాదాపు 20వేల రకాల జంతువుల ధ్వనులను ఇక్కడ మీరు రాత్రిపూట వింటారు. లాడ్జ్​లో ఒక రోజు గడపాలంటే ఇద్దరికి కలిపి 378 యూరోస్ (దాదాపు రూ. 29 వేలు)​ ఖర్చవుతుంది. అదే పిల్లలతో కలిసి వెళ్తే అదనంగా 50 యూరోస్​ చెల్లించాల్సి ఉంటుంది.

"ఇది అద్భుతమైన అనుభవం. ఎందుకంటే మీరు 'జూ'ని చూసే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. జంతువులు సాయంత్రం వేళల్లో వస్తాయి, ముఖ్యంగా సింహాలు సూర్యుడు అస్తమించే సమయంలో చురుకుగా ఉంటాయి. మీరు జూ చుట్టూ ఉన్న అన్ని శబ్దాలను వినవచ్చు. అలాగే రీజెంట్ పార్క్ నడిబొడ్డున ఉంటాము కనుక ఉదయం కూడా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు రకరకాల పక్షులు శబ్దాలన్నీ ఉదయం లేవగానే వినవచ్చు"

-జాయ్​ హాడ్​ఫీల్డ్​, పార్కు నిర్వాహకురాలు​

నగరం నడిబొడ్డులో ఉన్న బోటింగ్​ సౌకర్యాలను చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. విలాసవంతమైన గదులు, లగ్సరీ బాత్​ టబ్​లు, చూడచక్కనైన కళాకృతులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా వంటవ్యక్తి కావాలన్నా, యోగా చెయ్యాలనుకున్నా, మీకు అందుబాటులో ఉంచుతారు.

గుడారాలు, కట్టెల మంటల మధ్య గడిపే తీపి అనుభవాలు మిమ్మల్ని ఇక్కడ ఆకట్టుకుంటాయి. వీటి నుంచి వచ్చిన ఆదాయం వన్యప్రాణుల ఆరోగ్య సమస్యలపై పరిశోధన చేసే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ (జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్) కు వెళుతుంది. ఇది అంతరించిపోతున్న జంతు జాతులను కాపాడటానికి దోహదపడుతుంది.

ఇదీ చూడండి:అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.