ETV Bharat / international

నేనూ ఆ టీకానే తీసుకోబోతున్నా: బోరిస్‌

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకాల వినియోగాన్ని పలు దేశాలు నిలిపివేస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఆ టీకాను తీసుకోనున్నట్లు చెప్పారు. పార్లమెంట్​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

astrazeneca vaccine boris johnson
నేనూ ఆ టీకానే తీసుకోబోతున్నా: బోరిస్‌
author img

By

Published : Mar 18, 2021, 2:31 PM IST

ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమేనని, త్వరలో తాను కూడా అదే టీకా తీసుకోబోతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. ఈ టీకా వినియోగాన్ని పలు ఐరోపా దేశాలు నిలిపివేయడంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు.

"అతి త్వరలో నాకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు సమాచారం అందింది. అది కచ్చితంగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకానే అయ్యే అవకాశం ఉంది" అని జాన్సన్‌ తెలిపారు. ఇప్పటికే ఈ టీకా గురించి బోరిస్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. "ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమే. ఇది కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తోంది" అని పేర్కొనడం విశేషం.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కారణంగా రక్తంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఐరోపాలోని పలు దేశాలు ఆ టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తమ వ్యాక్సిన్‌ కారణంగా రక్తంలో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆరోపణల్ని ఆస్ట్రాజెనెకా సంస్థ ఇదివరకే ఖండించింది. టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చినట్లు ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ సురక్షితమేనని వివరించింది.

బ్రిటన్‌లో ఇప్పటి వరకు 25 మిలియన్ల మందికి పైగా తొలి డోసు వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారిలో 11 మిలియన్ల మంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.