ETV Bharat / international

ఆ దేశంలో వయోజనులందరికి వ్యాక్సిన్ పూర్తి! - వియత్నాం లాక్​డౌన్​

జులై చివరినాటికి వయెజనులందరికీ టీకా అందించాలన్న లక్ష్యాన్ని ముందే చేరుకున్నట్లు బ్రిటన్​ తెలిపింది. 87 శాతం మందికిపైగా తొలి డోసు పంపిణీ చేయగా.. 67 శాతం మందికి రెండు డోసులు అందించినట్టు పేర్కొంది. మరోవైపు కొవిడ్​ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వియత్నాంలో పాక్షిక లాక్​డౌన్​ విధించారు.

UK vaccination
బ్రిటన్​ వ్యాక్సినేషన్​
author img

By

Published : Jul 19, 2021, 5:03 AM IST

జులై నెలాఖరికి వయెజనులందరికీ టీకా పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని ఇంకా కొన్ని రోజులు మిగిలుండగానే సాధించినట్లు బ్రిటన్​ ప్రభుత్వం ప్రకటించింది.​ జులై 19 నాటికి పెద్దలందరికీ టీకా అందించాలని.. అలాగే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రెండు డోసులు వేయాలని ప్రధాని బోరిస్​ జాన్సన్​ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనిని ముందే సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా.. "ఎనిమిది నెలలుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో మైలు రాయిని చేరుకున్నాం" అని బోరిస్​ తెలిపారు.

ఇప్పటివరకు 87.8శాతం మందికి టీకా తొలి డోసు అందించగా.. 67.8శాతం మందికి రెండు డోసులు వేసినట్లు ఆ దేశ ఆరోగ్య, సామాజిక సంక్షేమ విభాగం(డీహెచ్​ఎస్​సీ) తెలిపింది.

వియత్నంలో పాక్షిక లాక్​డౌన్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే కొన్నిదేశాలు పాక్షిక లాక్​డౌన్​ అమలు చేయగ.. తాజాగా వియత్నాం కూడా ఈ జాబితాలో చేరింది. దేశంలోని దక్షిణాది ప్రాంతంలో రెండు వారాలు లాక్​డౌన్​ విధించింది. ఆ ప్రాంతంలో వరుసగా మూడోరోజు.. 3,000 కంటే ఎక్కువ కేసులు నమోదైన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 19 కోట్ల 9 లక్షల 69 లక్షలకు దాటింది. ఇప్పవరకు 41 లక్షల మంది కొవిడ్​తో మృతి చెందారు. కాగా 17 కోట్ల 39 లక్షల 62 వేలమందికిపైగా కోలుకున్నారు. బ్రిటన్​, అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యా సహా పలు దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది.

ఇదీ చూడండి: 'ఐసోలేషన్​'పై ఆ దేశ ప్రధాని యూటర్న్​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.