క్యాన్సర్ నిర్ధరణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సరికొత్త రక్తపరీక్ష ఒకటి త్వరలోనే అందుబాటులోకి రానుంది! లక్షణాలు బయటపడకముందే.. 50 రకాలకుపైగా క్యాన్సర్లను సులువుగా గుర్తించగల ఈ పరీక్షను గ్రెయిల్ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసింది. దాని కచ్చితత్వాన్ని నిర్ధరించేందుకుగాను బ్రిటన్‌కు చెందిన 'నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)' సోమవారం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ట్రయల్‌కు సోమవారం శ్రీకారం చుట్టింది. ఇంగ్లండ్‌లో 8 వేర్వేరు ప్రాంతాల నుంచి 1.4 లక్షల మంది వలంటీర్లను ఇందుకోసం నియమించుకోనుంది.
'గాలరీ' పేరుతో పిలిచే ఈ పరీక్షలో రక్తనమూనాలను పరీశీలిస్తారు. మెడ, తల, పేగులు, ఊపిరితిత్తులు, క్లోమం, గొంతు భాగాల్లో వచ్చే క్యాన్సర్లను తొలి దశల్లో గుర్తించడం చాలా కష్టం. వాటిని కూడా తాజా పరీక్ష వేగంగా, సులభంగా నిర్ధరిస్తుంది. కణితుల నుంచి రక్తప్రవాహంలోకి విడుదలయ్యే కణరహిత డీఎన్‌ఏల (సీఎఫ్ డీఎన్‌ఏ) వల్ల తలెత్తే రసాయనిక మార్పులను పసిగట్టడం ద్వారా ఇది పనిచేస్తుంది. క్యాన్సర్‌ను నిర్ధరించడంతో పాటు శరీరంలో కణితి ఎక్కడుందో కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం 'గాలరీ' ప్రత్యేకత.
ఇవీ చూడండి: 'కశ్మీరీ' వైద్యుడి సాయం.. ఇజ్రాయెల్ వెళ్లి శస్త్రచికిత్స!