ETV Bharat / international

మహిళల నిరసనలతో దిగొచ్చిన యూకే ప్రభుత్వం

మహిళలు, బాలికల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు బ్రిటన్​ ప్రభుత్వం సిద్ధమైంది. వీధి దీపాలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నిధులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు సారా ఎవెరార్డ్​ కిడ్నాప్, హత్య కేసులో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.

UK funds street lights, CCTV amid anger over woman's killing
బ్రిటన్​లో మహిళ హత్య- మిన్నంటిన నిరసనలు
author img

By

Published : Mar 16, 2021, 5:02 PM IST

బ్రిటన్​లో 33 ఏళ్ల మహిళ హత్యపై వెల్లువెత్తిన నిరసనలతో బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. మహిళలు, బాలికల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వీధి దీపాలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నిధులను పెంచేందుకు సిద్ధమైంది. పైలట్​ ప్రాజెక్టుగా.. బార్లు, నైట్​ క్లబ్బుల పరిసరాల్లో యూనిఫామ్​లో లేని పోలీసులను మోహరించాలని భావిస్తోంది.

మహిళ భద్రత కోసం ప్రస్తుత కేటాయింపులకన్నా రెట్టింపు స్థాయిలో(45 మిలియన్ పౌండ్లు) ఖర్చు చేయనున్నామని బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్ సోమవారం​ తెలిపారు.

కొనసాగుతున్న నిరసనలు

33 ఏళ్ల సారా ఎవెరార్డ్​ కిడ్నాప్, హత్యకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలతో బ్రిటన్ హోరెత్తుతోంది. ఈ కేసులో ఓ పోలీస్​ అధికారిని మెట్రోపాలిటన్​ కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా నిబంధనలు లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున లండన్​ రోడ్లపైకి వచ్చి పోలీస్ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

లండన్​లో నిరసనలు

మార్చి 3న.. బ్రిటన్​ సౌత్ లండన్​లోని క్లాఫమ్​ నుంచి బ్రిక్స్​టన్​కు నడుచుకుంటూ వెళ్తున్న సారా ఎవెరార్డ్​ కిడ్నాప్​కు గురయ్యారు. లండన్​కు 100 కిలోమీటర్ల దూరంలోని వుడ్​ ల్యాండ్​ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

ఇదీ చూడండి:ఆస్ట్రాజెనెకా టీకాపై నిషేధం ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.