ETV Bharat / international

భారత్​ నుంచి బ్రిటన్​ వెళ్లేవారికి ఇక నో క్వారంటైన్! - బ్రిటన్​లో కరోనా ప్రయాణ ఆంక్షలు

కరోనా దృష్ట్యా భారత్​పై విధించిన ప్రయాణ ఆంక్షలను యూకే ప్రభుత్వం సడలించింది. తాము ఆమోదించిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారు తమ దేశానికి రావొచ్చని ఉత్తర్వులు జారీచేసింది.

UK eases travel restrictions
యూకే ప్రయాణాలకు బ్రిటన్​ పచ్చజెండా
author img

By

Published : Aug 8, 2021, 12:06 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన బ్రిటన్.. వాటిని కొంచెం సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భారత్​ను రెడ్​ జాబితాలో ఉంచిన యూకే ప్రస్తుతం పసుపు జాబితాలో మార్చింది. ఈ నిర్ణయంతో భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులు వ్యాక్సినేషన్​ పూర్తి చేసుకొని ఉండాలి. అటువంటి వారికి 10 రోజుల హోటల్​ క్వారంటైన్ నుంచి మినహాయింపునిచ్చింది.

హోం క్వారెంటైన్​ తప్పనిసరి..

భారత్ ​నుంచి వెళ్లిన ప్రయాణికులు రెండు డోసులు తీసుకున్నట్లైతే.. యూకే వెళ్లిన తరువాత హోటల్​ క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి ఇళ్లలోనే ఉండాలని యూకే ప్రభుత్వం సూచించింది. అంతేగాక ప్రయాణికులు యూకేలో ఎక్కడ ఉంటున్నారనే ఫారాన్ని పక్కాగా పూర్తి చేసి వెళ్లాలని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా ప్రభుత్వం ఆమోదించిన క్వారెంటైన్​ కేంద్రాల్లో డబ్బులు కట్టి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేగాకుండా యూకేలో గానీ, ఐరోపా దేశాల్లో టీకా తీసుకున్న వారు హోం క్వారెంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.

తాము ఆమోదించిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారు మాత్రమే రావొచ్చని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ ప్రభుత్వం ఆమోదించిన భారతీయ వ్యాక్సిన్​లో కొవిషీల్డ్​ ఉందని పేర్కొంది యూకే.

ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.