ETV Bharat / international

మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగం దశకు బ్రిటన్

బ్రిటన్​లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు తమ కరోనా వ్యాక్సిన్​ను ఈ వారంలోనే మనుషులపై ప్రయోగించనున్నారు. 300 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు రెండు డోసుల వ్యాక్సిన్​ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం బ్రిటన్ సర్కారు 51 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

author img

By

Published : Jun 16, 2020, 4:50 PM IST

britain
మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగం దశకు బ్రిటన్

బ్రిటన్​ రాజధాని లండన్​లోని ఇంపీరియల్ కళాశాల వ్యాక్సిన్ తయారీ దిశగా మరో ముందడుగు వేసింది. 300 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు పరిశోధనాత్మక వ్యాక్సిన్​ను ఇవ్వనుంది. తమ కళాశాలకు చెందిన విద్యార్థులపై వ్యాక్సిన్​ను ప్రయోగించనుంది. ఇందులో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్​ను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇంపీరియల్ కళాశాల తయారుచేసిన ఈ వ్యాక్సిన్​ తయారీకి బ్రిటన్ ప్రభుత్వం 51 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది.

ఇప్పటివరకు ల్యాబొరేటరీలో జంతువులపై వ్యాక్సిన్​ను పరీక్షించినట్లు చెప్పారు శాస్త్రవేత్తలు. వైరస్​తో బాధపడే రోగులతో పోలిస్తే ఆయా జంతువుల్లో యాంటీబాడీలు అధికస్థాయిలో ఉత్పత్తి అయినట్లు చెప్పారు.

"దీర్ఘకాలికంగా బలహీనంగా ఉన్నవారి కోసం ఓ కీలక వ్యాక్సిన్​ను తయారుచేయాలి. ఆంక్షలను సడలించి ప్రజా జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి."

-రాబిన్ షాటోక్, పరిశోధకుడు

ఈ వ్యాక్సిన్​ను ఒకసారి ఇస్తే శరీరంలోని కణాలు కరోనాకు వ్యతిరేకంగా ప్రొటీన్​ను ఉత్పత్తి చేయడంలో దోహాదపడుతుంది.

ఇప్పటికే 12 వ్యాక్సిన్​లను వేలమందిపై ప్రయోగించారు. అయితే వైరస్​ను నియంత్రించడంలో ఏది సమర్థంగా పోరాడనుందో ఫలితాలు బయటకు రాలేదు. ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ తయారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవలే 10వేలమందిపై అడ్వాన్స్ స్టడీని ప్రారంభించింది. అమెరికా.. జులైలో 30 వేలమందిపై ఆక్స్​ఫర్డ్, జాతీయ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్​లను ప్రయోగించనుంది.

ఇంత తక్కువ వ్యవధిలో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్​ను తయారుచేయడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా వ్యాక్సిన్​ కోసం ముందస్తు బుకింగ్ చేశాయి.

ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాక్​పై మరోసారి భారత్​ ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.