ETV Bharat / international

లండన్:​ ఉగ్రదాడి'లో ఇద్దరు మృతి.. దుండగుడు హతం - latest international news

లండన్​ బ్రిడ్జి వద్ద ఓ దుండగుడు ఉత్తుత్తి బాంబును తగిలించుకుని కత్తితో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటనను స్కాట్లాండ్​ అధికారులు ఉగ్రదాడిగా పరిగణించారు. దుండగుడికి ఐసిస్​ ఉగ్రసంస్థతో సంబంధాలున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

london
లండన్:​ ఉగ్రదాడిలో ముష్కరుడితో సహా ఇద్దరు మృతి
author img

By

Published : Nov 30, 2019, 5:46 AM IST

Updated : Nov 30, 2019, 6:14 AM IST

లండన్:​ ఉగ్రదాడిలో ముష్కరుడితో సహా ఇద్దరు మృతి

లండన్​ స్కాట్​లాండ్​ యార్డ్​ పరిధిలోని ప్రఖ్యాత లండన్​ బ్రిడ్జిపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ జరిగింది..

లండన్​లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. నకిలీ బాంబును ఒంటికి చుట్టుకుని చేతిలో కత్తిపట్టుకొని లండన్ బ్రిడ్జిపై ఉన్న వ్యక్తులపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జిపై ఉన్న ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుండగా కొంతమంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో దుండగుడు ఇద్దరు వ్యక్తులపై కత్తితో పొడిచాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కాల్చి చంపారు.

ఎన్నికల ప్రచారం మధ్యలో..

ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. డౌనింగ్​ స్ట్రీట్​కు వచ్చిన ఆయన ఉగ్రవాద ఘటనపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడిని ఖండించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారిపై ప్రగాఢ ​ సానుభూతి తెలిపారు.

"ఈ దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఇతరులను కాపాడటానికి వారి ప్రాణాలను పన్నంగా పెట్టారు. వారు మన దేశ హీరోలు."

-బోరిస్​ జాన్సన్​, ప్రధాన మంత్రి.

దుండగుడి చర్యను ఉగ్రవాద ఘటనగా పరిగణిస్తున్నట్లు స్కాట్​లాండ్​ యార్డ్​ పోలీసు అధికారు తెలిపారు. ఈ దుండగునికి ఐసిస్​తో సంబంధాలున్నట్లు భద్రతా వర్గాల సమాచారం. అతని వద్ద పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానంతో అతడిని కాల్చి చంపిన్నట్లు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

గతంలో ఇదే బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడిలో 11 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి : రేపే ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
MSF (Medecins Sans Frontieres/Doctors Without Borders) - AP CLIENTS ONLY
Mediterranean Sea - 28 November 2019
++NIGHT SHOTS++
1. Rescuer holding torch
2. Rescuers on boat
3. Rescuers approaching boat of migrants
4. Various of rescuers handing over life jackets to migrants
5. Wide of migrant boat
6. Various of migrants boarding rescue boat
7. Migrant being assisted by rescuers on boat
8. Cutaway of migrants' feet
9. Migrants in queue on boat
STORYLINE:
Dozens of migrants have been rescued from an overcrowded boat in the central Mediterranean Sea.
The Doctors Without Borders ship 'Ocean Viking' found 60 people on the wooden boat late on Thursday night.
The migrants, including 18 children, were assisted onto the rescue vessel, according to the NGO.
Rescuers onboard the ship said that some of the migrants had reported being at sea for two days.
Many of the migrants had suffered symptoms of exposure and dehydration and one man was given medical attention for a leg injury, according to rescuers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 30, 2019, 6:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.