ఇటలీలోని వెనిస్ నగర సముద్ర తీర ప్రాంతంలో ఓ స్పీడు బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీడ్ బోట్ రేస్‌లో భాగంగా... అత్యంత వేగంతో వెళ్లి రికార్డు నెలకొల్పడానికి ప్రయత్నించే క్రమంలో ఘోరం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మొనాకో మధ్యదరా ఓడరేవు మాంటే కార్లో నుంచి వెనిస్ వెళ్లే మార్గంలో ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.
ఇదీ చూడండి:అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడే!