కరోనా వంకతో నిరసనలను ప్రభుత్వం నిషేధం విధించడానికి ప్రయత్నిస్తోందని బ్రిటన్ ప్రజలు ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనూ తము నిరసనలు తెలిపేలా మినహాయింపు ఇవ్వాలని, మానవహక్కుల కార్యకర్తలు.. ప్రత్యేకంగా జాతివివక్షపై పోరాడుతున్న వ్యక్తులు లండన్‌లో ఆందోళనకు దిగారు. నిరసనలు తెలిపే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
లాక్డౌన్ నిబంధనలను ఖాతరు చేయకుండా వేలమంది.. లండన్‌లో నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు... శాంతియుత నిరసనలకు లాక్డౌన్ నిబంధల నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్‌కు 60మంది ఎంపీలు లేఖ రాశారు.
బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతించటం లేదు.
ఇదీ చదవండి: మహిళల నిరసనలతో దిగొచ్చిన యూకే ప్రభుత్వం