కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో 'కొవాక్స్'కు కొవిడ్-19 వ్యాక్సిన్ల(covax vaccine india) సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన భారత్‌పై ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అది ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది.
ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్(world health organization president).
" కొవాక్స్ కీలకమైన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను వచ్చే అక్టోబర్‌లో భారత్ పునరుద్ధరిస్తుందని ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాకు నా కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని 40 శాతం మంది ప్రజలకు ఈ ఏడాది చివరి నాటికి టీకా అందాలనే లక్ష్యానికి మద్దతుగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. "
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా..
కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించాలని నిర్ణయించింది. భారత్‌లో అదనంగా ఉన్న కొవిడ్ టీకాలను 'వ్యాక్సిన్ మైత్రి'(vaccine maitri) కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సెప్టెంబర్ 20న ప్రకటించారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. దేశ పౌరులకు వ్యాక్సిన్(india vaccine news) వేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్ టీకా సాయం'