కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరోసారి ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్నాయి. అయితే దీనిపై పలు దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్జిజంలో (Belgium Coronavirus Restrictions) వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని బ్రసెల్స్‌లో (Belgium Coronavirus Restrictions) ఆదివారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా 'ఫ్రీడం.. ఫ్రీడం' అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై (Belgium Coronavirus Restrictions) నిరసనకారులు రాళ్లు రువ్వారు. కార్లను ధ్వంసం చేయడం సహా అక్కడున్న చెత్తకుండీలకు నిప్పంటిచారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.
నిరసన హింసాత్మకంగా మారగనే అక్కడున్న వారిలో దాదాపు 35వేల మంది తిరిగి వెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ హింసలో గాయపడిన పోలీసుల సంఖ్యపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు. అరెస్ట్ అయిన నిరసనకారుల సంఖ్యపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
డచ్లోనూ...
కరోనా ఆంక్షలపై నెదర్లాండ్స్‌లోనూ నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు చోట్ల స్థానిక యువత వాహనాలను ధ్వంసం చేయడం సహా రోడ్లపై నిప్పు పెట్టారు. ఇప్పటివరకు 51 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
ఆంక్షలకు ముందు..
ఆస్ట్రియాలో సోమవారం నుంచి లాక్డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ఆదివారం మార్కెట్లు కిక్కిరిసాయి. ప్రజలంతా కాఫీ షాపులకు, క్రిస్మస్ షాపింగ్‌ల కోసం మార్కెట్లకు పోటెత్తారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పది రోజుల పాటు ఉండే ఈ ఆంక్షలు.. వైరస్ ఉద్ధృతి బట్టీ మరో 10 రోజులు పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : కొవిడ్ నిబంధనలు మాకొద్దని రోడ్డెక్కిన వేలమంది