ETV Bharat / international

సోషల్​ మీడియాపై నియంత్రణ.. ఏ దేశంలో ఎలా? - ఓటీటీ మార్గదర్శకాలు ఈటీవీ భారత్​

సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం కొత్త నియమావళిని రూపొందించి వార్తల్లో నిలిచింది భారత ప్రభుత్వం. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఓటీటీ, సోషల్​ మీడియా వేదికలను నియంత్రిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే.. జరిమానాల నుంచి జైలు శిక్షల వరకు చర్యలు చేపడుతున్నాయి. ఓసారి వాటిని చూద్దాం.

Social Media status and laws from around the world
సోషల్​ మీడియపై నియంత్రం.. ఏ దేశంలో ఎలా?
author img

By

Published : Feb 26, 2021, 12:23 PM IST

సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు కొత్త నియమావళిని రూపొందించినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. తప్పుడు సమాచారానికి కారణమయ్యే వ్యక్తి వివరాలు కేంద్రానికి వెల్లడించడం, ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం వంటి నియమాలు ఇందులో ఉన్నాయి. కేంద్రం ప్రకటనతో.. ఓటీటీలు, సామాజిక మాధ్యమాల నియంత్రణ అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు.. ఓటీటీ వేదికలపై ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నాయో చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా సోషల్​ మీడియా వినియోగదారుల సంఖ్య 3.96బిలియన్​ పైనే ఉంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో.. ఓ వ్యక్తికి సగటున 8.6 ఖాతాలు ఉన్నట్టు తేలింది. ప్రపంచ జనాభాలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారు 50.64 శాతం ఉన్నారు.

జర్మనీ

జర్మనీలో.. నెట్​జెడ్​​డీజీ చట్టం 2018లో అమల్లోకి వచ్చింది. దేశంలో రెండు మిలియన్ల​ వినియోగదారులు ఉన్న సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది.

దీని ప్రకారం.. ఫిర్యాదులు అందితే కంటెంట్​ను సమీక్షించేందుకు సంస్థలు నియమాలు ఏర్పాటు చేయాలి. చట్టవిరుద్ధమైన సమాచారాన్ని 24 గంటల్లో తొలగించాలి. కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయని ప్రతి 6 నెలలకోసారి అప్​డేట్స్​ ఇవ్వాలి.

నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులకు రూ. 5.6మిలియన్​ డాలర్లు, సంస్థలకు 6 మిలియన్​ డాలర్ల వరకు జరిమానా విధిస్తారు.

ఐరోపా

ఐరోపా.. 2016 ఏప్రిల్​లో జీడీపీఆర్​(జనరల్​ డేటా ప్రొటెక్షన్​ రెగ్యులేషన్​)ను ప్రవేశపెట్టింది. సామాజిక మాధ్యమాలతో పాటు కంపెనీలు.. వినియోగదారుడి డేటా వినియోగించుకోవడం, స్టోర్​ చేసుకోవడం వంటి వాటిపై నిబంధనలు విధించింది.

ఇదీ చూడండి:- 'మాట్లాడే స్వేచ్ఛను హరించేందుకే ఈ నియమాలు'

కాపీరైట్​ విషయంలోనూ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్​ను పోస్ట్​ చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియా...

2019లో షేరింగ్​ ఆఫ్​ అబోరెన్ట్​ వాయిలెంట్​ మెటీరియల్​ యాక్ట్​ను ప్రవేశపెట్టింది ఆస్ట్రేలియా. ఇందులో కఠిన చర్యలే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల కంపెనీలకు భారీ స్థాయిలో జరిమానాలు విధించడం, టెక్​ ఎగ్జిక్యూటివ్​లకు 3ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడం, కంపెనీల అంతర్జాతీయ ఆదాయంపై 10శాతం వరకు జరిమానా వేయడం వంటి చర్యలు చేపట్టింది.

చట్టవిరుద్ధంగా ఉండే కంటెంట్​ను 48గంటల్లో తొలగించే విధంగా ఈసెఫ్టీ కమిషనర్​ కార్యాలయం.. ఎప్పుడైనా నోటీసులు ఇవ్వొచ్చు.

రష్యా...

2019లో ఓ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది రష్యా. దీని ప్రకారం.. ఎమర్జెన్సీ సమయంలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ- సామాజిక మాధ్యమాలకు ఉన్న అనుసంధానాన్ని తొలగించవచ్చు.

2015 డేటా చట్టం ప్రకారం.. దేశంలో ఉండే సర్వర్లలోనే రష్యన్ల డేటా పొందుపరచాలి.

చైనా..

సామాజిక మాధ్యమాలపై కఠిన వైఖరే ప్రదర్శిస్తుంది చైనా. ట్విట్టర్​, గూగుల్​, వాట్సప్​ ఆ దేశంలో నిషేధం. దేశీయ యాప్స్​ వైబో, బైడు, వీచాట్​లు వీటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.

733 వెబ్​సైట్లను మూసివేసినట్టు, 9,382 యాప్స్​ను తొలగించినట్టు 2019 చివర్లో చైనా సైబర్​స్పేస్​ యంత్రాంగం ప్రకటించింది.

చైనాలో వేలాదిమంది సైబర్​-పోలీసులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

ఇదీ చూడండి:- మహిళను చంపి గుండెతో ఆలుగడ్డ కూర!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.