ETV Bharat / international

కరోనా కొత్త రకంతో బ్రిటన్​ అతలాకుతలం - స్ట్రెయిన్​

బ్రిటన్​ను కరోనా స్ట్రెయిన్​ అతలాకుతలం చేస్తోంది. కొవిడ్​ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు లభించటం లేదు. యూకేలోని అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు ప్రస్తుతానికి నిలిపివేసి..కేవలం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ​యూకేలో కేసులు ఒక్కసారిగా పెరిగాయని వైద్యులు నిర్ధరించారు.

S.Korea confirms 1st cases from Covid-19 variant
కరోనా స్ట్రెయిన్​తో బ్రిటన్​ అతలాకుతలం
author img

By

Published : Dec 28, 2020, 11:29 PM IST

బ్రిటన్​లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ విజృంభిస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు పడకలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు ప్రస్తుతానికి నిలిపివేసి.. కేవలం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆస్ట్రాజెనెకా- ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి త్వరలో అనుమతి లభిస్తుందని సమాచారం.

దక్షిణ కొరియాలో కొత్త రకం కరోనా

దక్షిణ కొరియాలో కరోనా కొత్త స్ట్రెయిన్​ కలకలం రేపింది. యూకే నుంచి వచ్చిన ముగ్గురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీళ్లు క్వారంటైన్​లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్​ కంటే దాదాపు 70శాతం వేగంతో ఈ స్ట్రెయిన్​ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 57,680 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 819 మంది మరణించారు.

జోర్డాన్​లోనూ స్ట్రెయిన్​

జోర్డాన్​లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్​ కలకలం సృష్టించింది. యూకే నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త రకం కరోనా వైరస్​ను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే యూకే నుంచి విమాన సేవలను రద్దు చేశాయి చాలా దేశాలు.

బ్రెజిల్​ ఉపాధ్యక్షుడికి కరోనా

బ్రెజిలి ఉపాధ్యక్షుడు హామిల్టన్​ మౌరావ్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్​లోకి వెళ్లారు. బ్రెజిల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. బ్రెజిల్​లో మొత్తం కేసుల సంఖ్య 7 కోట్ల 48 లక్షలు దాటింది. మరణాల సంఖ్య సైతం రెండు లక్షలకు చేరువలో ఉంది.

ఇదీ చదవండి : యూకేలో ఆంక్షలు మరింత కఠినతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.