నైరుతి ఇంగ్లాండ్ ప్లైమౌత్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఓ షూటర్ కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు డెవాన్, కార్న్‌వాల్ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కీహామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు. ఎయిర్ అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది త్వరితగతిన స్పందించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నేరస్థుడిగా భావిస్తున్న మరో వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైనట్లు భావిస్తున్నారు.