Russia Ukraine war: రష్యా సైనికుల దాడులకు దీటుగా బదులిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. మైకోలయివ్ విమానాశ్రయాన్ని రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ తమ అధీనంలో ఉందని స్థానిక గవర్నర్ విటాలియ్ కిమ్ వెల్లడించారు.
Mykolaiv airport toll
మరోవైపు, రష్యా ఆక్రమణ ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్లో 406 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐరాస మానవహక్కుల విభాగం వెల్లడించింది. ఆదివారం రాత్రి నాటికి 801 మంది గాయపడ్డారని తెలిపింది.
కచ్చితమైన విధానాన్ని అనుసరించి ప్రాణనష్టాన్ని అంచనా వేస్తున్నట్లు ఐరాస పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా మరణాలను నిర్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అయితే, వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని ఐరాస పేర్కొంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇటీవల ఎక్కువ మరణాలు నమోదయ్యాయని పేర్కొంది.
ఉక్రెయిన్ అధికారిక సమాచారం ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి: యుద్ధంపై విచారణకు రష్యా డుమ్మా.. మాస్కోను వెనకేసుకొచ్చిన చైనా