ETV Bharat / international

మకారివ్​​లో బేకరీపై రష్యా దాడి- 13 మంది మృతి - రష్యా ఉక్రెయిన్ వార్తలు

RUSSIA UKRAINE
పుతిన్​ ప్రభుత్వం కఠిన చర్యలు
author img

By

Published : Mar 7, 2022, 6:44 AM IST

Updated : Mar 7, 2022, 11:49 PM IST

23:47 March 07

ఉక్రెయిన్​లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మకారివ్​లోని ఓ పారిశ్రామిక బేకరీపై రష్యా బలగాలు షెల్స్​ను ప్రయోగించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ దాడి సమయంలో బేకరీ వద్ద 30 మంది ఉన్నారు. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించాయి.

21:24 March 07

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ సాయం

రష్యా దురాక్రమణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆ దేశానికి ఆర్థికసాయం ప్రకటించారు. మానవతా దృక్పథంతో 175మిలియన్‌ పౌండ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకూ బ్రిటన్‌ 400 మిలియన్‌ పౌండ్లను ఉక్రెయిన్‌కు సాయంగా అందించింది. ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్‌ అంచనాలు తప్పాయని, 12 రోజుల్లోనే అది ఆయనకు అర్థమైందని జాన్సన్‌ ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్‌లను తక్కువ అంచనా వేసి పుతిన్‌ భంగపడ్డారని విమర్శించారు.

19:40 March 07

రష్యా చేజారిన ఎయిర్​పోర్ట్

తమ దేశంపై దండెత్తిన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. రష్యన్ల అధీనంలోకి వెళ్లిన మైకోలయివ్ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక గవర్నర్ విటాలియ్ కిమ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

19:26 March 07

షరతులను అంగీకరిస్తే తక్షణమే సైనిక చర్య నిలిపేస్తాం.. పెస్కోవ్‌

ఉక్రెయిన్‌ తమ షరతులను అంగీకరిస్తే.. తక్షణమే సైనిక చర్యను నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా స్పష్టం చేసిందని ఆ దేశ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సోమవారం ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఏ కూటమిలోనూ చేరే అవకాశం లేకుండా.. ఉక్రెయిన్‌ తన రాజ్యాంగానికి సవరణలు చేయాలని పెస్కోవ్ చెప్పారు.

17:03 March 07

రాత్రి 7.30 గంటలకు రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య మూడో విడత చర్చలు

ఉక్రెయిన్‌- రష్యాల ప్రతినిధుల మధ్య సాయంత్రం నాలుగు గంటలకు మూడో దఫా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడించారు.

15:16 March 07

50 నిమిషాల పాటు మోదీ- పుతిన్​ ఫోన్​ సంభాషణ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఉక్రెయిన్​- రష్యా చర్చల పురోగతి గురించి ప్రధాని మోదీకి పుతిన్ వివరిచారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని మోదీ.. పుతిన్‌ను కోరారు. సుమీతోపాటు ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్‌ల ఏర్పాటుపై రష్యాను అభినందించారు. ముఖ్యంగా సుమీ నుంచి భారతీయుల తరలింపు అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఈ విషయమై తమవంతు సహకారం అందిస్తామని పుతిన్.. ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.

12:50 March 07

జెలెన్‌స్కీకి మోదీ ఫోన్​.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై చర్చ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో భాగంగా.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. దీంతోపాటు ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో అందించిన సహకారానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. సుమీ నుంచి భారతీయుల తరలింపునకు సహకారం కావాలని కోరారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

12:17 March 07

ఉక్రెయిన్‌కు యూకే 100 మిలియన్‌ డాలర్ల సాయం

రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్‌ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.

జపోరిషియాలో ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు బంద్‌

ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రమైన జపోరిషియా నూక్లియర్‌ ప్లాంట్‌ను రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ మొబైల్, ఇంటర్నెట్‌ సేవలను రష్యా బలగాలు నిలిపివేశాయి. ప్లాంట్‌ నుంచి ఎటువంటి సమాచారం బయటకు రావొద్దనే ఉద్దేశంతోనే ఈ సేవలను నిలిపివేసి ఉంటారని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

11:13 March 07

రాత్రి 7.30గంటలకు రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య మూడో విడత చర్చలు

ఉక్రెయిన్‌- రష్యాల ప్రతినిధుల మధ్య రాత్రి నాలుగు గంటలకు మూడో దఫా శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడించారు.

10:57 March 07

త్వరలో భారత్​కు హర్​జోత్​ సింగ్​

ఉక్రెయిన్​లో కాల్పుల్లో గాయపడ్డ భారత విద్యార్థి హర్​జోత్​ సింగ్​ సరిహద్దు దాటి పోలాండ్​ చేరుకున్నాడు. అక్కడ ఇతర విద్యార్థులతో పాటు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఎక్కిన హర్​జోత్​.. మరికొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకుంటాడు.

31 ఏళ్ల దిల్లీ యువకుడు హర్‌జోత్‌ సింగ్‌.. ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వెళ్తున్న సమయంలో జరిగిన కాల్పులో గాయపడ్డాడు.

08:50 March 07

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడనున్న మోదీ

రష్యా సైనిక చర్య కొనసాగుతున్న క్రమంలో మరోమారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. జెలెన్​స్కీకి మోదీ ఫోన్​ చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ​

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలి

తమ దేశంలోని రక్షణ పరిశ్రమలపై బాంబు దాడులకు పాల్పడతామని రష్యా ప్రకటించిందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. వీటిలో చాలా పరిశ్రమలు నివాసిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై ఏ ప్రపంచ నేత స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని.. ఆ దేశ వైఖరే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

08:24 March 07

రష్యాలో సేవలు రద్దు

రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రెడిట్​ కార్డ్​ సర్వీస్​ కంపెనీ అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ కీలక ప్రకటన చేసింది. రష్యా సహా ఆ దేశానికి మద్దతుగా నిలిచిన బెలారస్​లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యాలో తమ సేవలను రద్దు చేస్తున్నట్లు మాస్టర్​కార్డ్​, వీసా సంస్థలు ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది.

మరోవైపు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ కూడా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హాలీవుడ్​లోని అనేక సంస్థలు రష్యాలో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి.

06:54 March 07

మూడో విడత చర్చలు

ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఉక్రెయిన్​-రష్యాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్​తో రెండు సార్లు చర్చలు జరిపిన రష్యా.. మరోసారి చర్చలకు సిద్ధమైంది. సోమవారం మూడో విడత చర్చలు జరగనున్నాయి.

06:19 March 07

RUSSIA UKRAINE LIVE UPDATES: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం లైవ్​ అప్డేట్స్​

ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న భీకర దాడులను ప్రపంచ దేశాలే కాదు చాలా మంది రష్యన్లు కూడా తప్పుపట్టారు. యుద్ధాన్ని వెంటనే ఆపేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంపై రష్యా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 4,300 మంది నిరసనకారులను అరెస్ట్​ చేసింది.

మరోవైపు సామాజిక మాధ్యమాలు కూడా రష్యా ఆంక్షల కారణంగా తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ యాప్​లో లైవ్​ స్ట్రీమింగ్​ సహా కొత్తగా వీడియోలను చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సోషల్​ మీడియా యాప్​ టిక్​టాక్​ ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ఫేక్​న్యూస్​ చట్టం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Last Updated : Mar 7, 2022, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.