ETV Bharat / international

రష్యా చేతిలో బందీగా 4లక్షల ఉక్రెనియన్లు.. బైడెన్​కు జెలెన్​స్కీ ఫోన్​

Russia Ukraine war: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య పదకొండు రోజులుగా కొనసాగుతోంది. క్షిపణులు, బాంబుల మోతతో ఉక్రెయిన్​ దద్ధరిల్లుతోంది. మరోవైపు.. తమ దేశానికి మద్దతుగా నిలవాలని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ కోరుతున్నారు. మరోమారు అమెరికా అధ్యక్షుడు బైడెన్​తో మాట్లాడి.. సాయం అందించాలని కోరారు. ఇరు దేశాల మధ్య మూడో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి. మరోవైపు.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. వీసా, మాస్టర్​కార్డు, పూమా వంటి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

zelensky
వొలొదిమిర్​ జెలెన్​స్కీ
author img

By

Published : Mar 6, 2022, 8:01 AM IST

Russia Ukraine war: ఉక్రెయిన్​పై రష్యన్​ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. తాజాగా మరోమారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ఫోన్​లో మాట్లాడారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఉక్రెయిన్​కు రక్షణ, ఆర్థిక సాయం వంటి కీలక అంశాలపై చర్చించారు. యుద్ధం మొదలైన తర్వాత బైడెన్​తో.. జెలెన్​స్కీ ఫోన్​లో మాట్లాడటం ఇది రెండోసారి.

'అమెరికా అధ్యక్షుడితో మరోమారు మాట్లాడాను. ఉక్రెయిన్​కు రక్షణ, ఆర్థిక సాయం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి కీలక అంశాలు చర్చల అజెండాలో ఉన్నాయి.'

-వొలొదిమిర్​ జెలెన్​స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు

మరోవైపు.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అర్ధగంట పాటు చర్చలు జరిగినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

బ్లింకెన్​తో ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి భేటీ

రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​తో పొలండ్​ సరిహద్దులో భేటీ అయ్యారు ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా. రష్యాపై ఆంక్షలు, కీవ్​ రక్షణ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. 'ఉక్రెయిన్​- పొలిస్​ సరిహద్దులో యూఎస్​ విదేశాంగ మంత్రి బ్లింకెన్​ను కలిశాను. ఉక్రెయిన్​కు అవసరమైన ఆయుధాలను అందించటం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించి, ఒత్తిడి పెంచే మార్గాలపై చర్చించాం.' అని ట్వీట్​ చేశారు కులేబా. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, రష్యాపై విధించిన ఆంక్షలను కఠినతరం చేయటంపై ఇరుదేశాలు సమ్మతించాయన్నారు.

ఉక్రెయిన్​ ప్రజలకు అమెరికాతో పాటు యావత్​ ప్రపంచం అండగా ఉంటుందని భరోసా కల్పించారు బ్లింకెన్​. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రష్యా చేతిలో బందీగా 4 లక్షల మంది ఉక్రెనియన్లు

మేరియుపొల్​లోని పౌరులను తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా మాట తప్పిందని ఆరోపించారు ఆ నగర మేయర్​ వదిమ్​ బాయ్​చెంకో. నగరాన్ని రష్యా నిర్బంధించి.. మానవతా కారిడార్​కు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బందీగా ఉన్నారని తెలిపారు.

ఉక్రెయిన్​- రష్యా మధ్య మూడో దఫా చర్చలు

ఉక్రెయిన్​- రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం లభించటం లేదు. ఈ క్రమంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. మూడో విడత చర్చలు సోమవారం (మార్చి 8న) జరగనున్నాయని ఉక్రెయిన్​ చర్చల బృంద సభ్యుడు డేవిడ్​ అరఖమియా తెలిపారు. కాల్పుల విరమణ, పౌరులను సురక్షితంగా తరలించే అంశం ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయని తెలిపారు.

పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని భేటీ..

ఉక్రెయిన్​పై రష్యా దాడుల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయ్యారు ఇజ్రాయెల్​ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్​. ఉక్రెయిన్​తో చర్చలు చేపట్టాలని కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కీవ్​, మాస్కోలతో ఇజ్రాయెల్​కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. చర్చల దిశగా రష్యాతో చర్చలు చేపట్టాలని ఆ దేశాన్ని కోరింది ఉక్రెయిన్​.

మూడో అణు కేంద్రం దిశగా రష్యన్​ సేనలు

ఉక్రెయిన్​లోని రెండు అణు విద్యుత్తు కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకున్న రష్యన్​ సేనలు.. మూడో న్యూక్లియర్​ ప్లాంట్​ దిశగా వేగంగా కదులుతున్నాయని అమెరికా సెనేటర్లతో అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ చెప్పారు. మైకోలేవ్​కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుజ్నౌక్రైన్స్​ అణు కేంద్రానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జపోరిజియా, చెర్నోబిల్​ అణు విద్యుత్తు కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి రష్యన్​ దళాలు.

కొనసాగుతున్న ఆంక్షలు..

ఉక్రెయిన్​పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి వీసా, మాస్టర్​కార్డ్​. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేవలను ఆపేస్తామని ప్రకటించాయని ఉక్రెయిన్​ మీడియా తెలిపింది. మరోవైపు.. రష్యాలోని అన్ని స్టోర్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పూమా తెలిపింది. ఇప్పటికే రష్యాకు సరఫరా ఆగిపోయినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.