ETV Bharat / international

టీకాల ప్రభావం పెంచాలా? అయితే కలిపేద్దాం! - ఆస్ట్రాజెనికా

బ్రిటన్​ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో రష్యా ఒప్పందం చేసుకుంది. స్పుత్నిక్​ టీకాను ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్​తో కలిపి ప్రయోగించనుంది.

Russia, AstraZeneca to test combination of COVID-19 shots
ఆస్ట్రాజెనెకాతో రష్యన్ శాస్ట్రవేత్తల ఒప్పందం
author img

By

Published : Dec 22, 2020, 10:28 AM IST

ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకాను స్పుత్నిక్​-వి వ్యాక్సిన్​తో కలిపి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. బ్రిటన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో ఇందుకు ఒప్పందం కుదిరినట్టు రష్యాకు చెందిన గమలేయా సంస్థ ప్రకటించింది. సుత్నిక్​ను కలపడం ద్వారా ఆస్ట్రాజెనెకా టీకా మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు వెల్లడించింది.

ఈ ఒప్పందంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ ఒప్పందం ద్వారా వ్యాక్సిన్లు, ముఖ్య ఔషధాలు రూపొందించడంలో మరింత పురోగతి సాధ్యమవుతుంది."

-వ్లాదిమిర్ పుతిన్​, రష్యా అధ్యక్షుడు.

విమర్శలు వస్తున్నా..

రెండు టీకాలు కలిపి ప్రయోగిద్దామని రష్యన్ శాస్త్రవేత్తలు నెల క్రితమే ఆస్ట్రాజెనెకాకు ప్రతిపాదించారు. ఆస్ట్రాజెనికా ఇందుకు అంగీకరించింది.

సరైన పరీక్షలు నిర్వహించకుండా స్పుత్నిక్​కు అనుమతి ఇవ్వడంపై రష్యా తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. అయితే... తమ వ్యాక్సిన్ 91శాతం ప్రభావితమని ఇటీవలె గమలేయ సెంటర్ ప్రకటించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ 70 శాతం ప్రభావితమని పరీక్షల్లో వెల్లడైంది.

ఇదీ చదవండి : కొవిషీల్డ్​, స్పుత్నిక్​-వీ టీకాలు కలిపి ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.