ETV Bharat / international

రెండో వ్యాక్సిన్​ను రిజిస్టర్‌ చేయనున్న రష్యా!

ఇప్పటికే స్పుత్నిక్​ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా.. కరోనాకు మరో వ్యాక్సిన్​ను విడుదల చేయనుంది. రెండో వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను అక్టోబర్​ 15న రిజిస్టర్​ చేసేందుకు సిద్ధమవుతోంది.

Russia to register second CORONA vaccine
రెండో వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్న రష్యా!
author img

By

Published : Oct 10, 2020, 2:35 PM IST

ఇప్పటికే కరోనా వైరస్‌ నివారణకు మొదటి వ్యాక్సిన్‌ను ప్రకటించి ఆశ్చర్యపర్చిన రష్యా.. మరి కొద్ది రోజుల్లో రెండో వ్యాక్సిన్‌ను కూడా రిజిస్టర్‌ చేయనుంది. సైబీరియాకు చెందిన వెక్టర్‌ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు గత నెలలోనే ప్రారంభదశ ప్రయోగాలు కూడా పూర్తయినట్లు, అక్టోబర్‌ 15న దాన్ని రిజిస్టర్‌ చేయనున్నట్లు ఆ తయారీ సంస్థ ప్రకటించింది.

కొద్ది నెలల క్రితం స్పుత్నిక్‌-వి పేరుతో రష్యా మొదటి వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసింది. అయితే, దానికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను ఆ దేశం బహిర్గతం చేయకపోవడం వల్ల వైద్య నిపుణులు దాని సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, స్పుత్నిక్ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించడంతో పాటు ఇక్కడ సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్, రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ ప్రయోగాల కోసం మరోసారి అనుమతి తీసుకోవాలని కేంద్ర ఔషధాల ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌ఓ) డాక్టర్ రెడ్డీస్‌ను కోరింది. వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ ప్రయోగాల కోసం సవరించిన ప్రొటోకాల్ ఆధారంగా మరింత సమాచారాన్ని అందించాలని ఇటీవల స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: రష్యా వ్యాక్సిన్​కు భారత్​లో మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.